Asianet News TeluguAsianet News Telugu

మలేరియా దోమలను నాశనం చేసేందుకు.. మరో దోమ

జన్యుపరంగా మార్పు చెందిన దోమలను తయారు చేసి.. మలేరియా, డెంగ్యూలకు కారకంగా మారుతున్న దోమల అంతు చూస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే పరిశోధనలు చేయగా.. ప్రయోగాత్మకంగా ఈ దోమలను విడుదలచేసేందుకు సిద్ధమౌతున్నారు.
 

Genetically modified trillions of mosquitoes will be exposed; Granted permission to experiment
Author
Hyderabad, First Published Jun 23, 2020, 1:20 PM IST

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. దోమలు విపరీతంగా వచ్చేస్తాయి. ఇక మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వంటి జబ్బులు వరసపెడతాయి. వీటి కారణంగా ప్రతి సంవత్సరం చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ దోమలకు చెక్ పెట్టేందుకు పరిశోధకులు మరో దోమలను తయారు చేశారు.

జన్యుపరంగా మార్పు చెందిన దోమలను తయారు చేసి.. మలేరియా, డెంగ్యూలకు కారకంగా మారుతున్న దోమల అంతు చూస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే పరిశోధనలు చేయగా.. ప్రయోగాత్మకంగా ఈ దోమలను విడుదలచేసేందుకు సిద్ధమౌతున్నారు.

బర్కినాఫాసోలో ఈమేరకు జరిగిన ప్రయోగాల్లో జన్యుపరంగా మార్పు చెందిన ఫంగస్( ఇదో రకం దోమ) విషాన్ని ఉత్పత్తి చేస్తుందని ఫలితంగా వేగంగా మలేరియా కారక దోమ లను ఎక్కువ శాతం నాశనం చేస్తుందని పరి శోధకులు తెలిపారు. 45రోజుల్లో దోమల సంతతి 90శాతం వరకు నాశనమవు తుందని యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్, బర్కి నోఫా సోలోని ఐఆర్‌ఎస్‌ఎస్ రీసెర్చి ఇనిస్టి ట్యూట్ పరిశోధకులు వెల్లడించారు.

మెటారీ జియమ్ పింగ్‌షాయెన్స్ అనే ఫం గస్‌ను పరి శోధకులు ఎంపిక చేశారు. ఈ ఫంగస్ మలే రియా దోమలను సహజంగా ప్రభా వితం చేస్తుంది. జన్యుపరంగా దీన్ని మార్పు చేయ డంతో ఇది విషపూరిత సాలీడుల్లో ఉం డే విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ప్రయోగశాలల్లో పరీక్షలు చేయగా జన్యుమార్పిడి ఫంగస్ వేగంగా ఆయా దోమలను నాశనం చేస్తుం దని తేలింది. నిజమైన గ్రామం వంటి నమా నా గ్రామాన్ని 6500 చదరపు అడుగుల్లో రూపొందించి దోమలను పరిశోధకులు విడి చిపెట్టారు.

అవి తమ సంతానోత్పత్తిని అక్కడ పూర్తి చేసేలా చూశారు. టెంట్ కంపార్టు మెంట్లలో ఉండే దోమలు ఫంగస్ ప్రభావా నికి గురై చనిపోయాయి. దీంతో మలేరియా నిర్మూలనకు వీలవుతుందన్న ఆశ కలిగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios