ఎక్కువ కాలం, ఆరోగ్యంగా జీవించడానికి ఆరోగ్యకరమైన ఎముకలు చాలా అవసరం. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారాన్ని ఖచ్చితంగా తినాలి.  

ఎముకలు బలంగా ఉండటానికి, ఎముకలు విరిగిపోయే ప్రమాదాన్ని తగ్గించడానికి కాల్షియాన్ని పుష్కలంగా తీసుకోవాలి. దీంతోపాటుగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఇది మీ ఎముకల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. లేకపోతే రికెట్స్, బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చిన్నప్పటి నుంచే ఎముకలు బలంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మీ ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. బోన్స్ వీక్ గా ఉండేవారు ఎలాంటి ఆహారాలను తింటే బలంగా మారుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

డైరీ ఫుడ్స్ 

బలవర్థకమైన సోయా మిల్క్, పాలు, పెరుగు, జున్ను, లాక్టోస్ ఫ్రీ మిల్క్ వంటి డైరీ ఫుడ్స్ లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు వీటిలో కొవ్వు కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. 

ఆకుకూరలు

బ్రోకలీ, క్యాబేజీ, బెండకాయ ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఆకుకూరల్లో ఉండే విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఎన్నో వ్యాధులను తగ్గించి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

సోయా బీన్స్

సోయా బీన్స్ లో ఉండే పోషకపదార్థాలు మహిళలకు బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. సోయా బీన్స్ ఎముక-ఆరోగ్యకరమైన పోషకానికి మంచి మూలం.

టోఫు

టోఫు కూడా ప్రోటీన్ కు మంచి వనరు. దీనిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాల్షియం , విటమిన్ డి రెండింటితో కూడిన సోయా పాలు ఎముకల ఆరోగ్య ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ పోషకాలన్నీ ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనవి.

మొక్కల ఆధారిత పానీయాలు

మొక్కల ఆధారిత పానీయాలలో సోయా పాలు, కొబ్బరి పాలు, బాదం జీడిపప్పు పాలు, అవిసె పాలు, బియ్యం పాలు, ఓట్ పాలు ఉన్నాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

గింజలు

వాల్ నట్స్, హాజెల్ నట్స్, గుమ్మడికాయ గింజలు, బాదం, నువ్వులు ఇతర మెగ్నీషియం, భాస్వరం ఉన్న గింజలు కూడా ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. వీటిలో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎముక ఆరోగ్యానికి అవసరమైన ఇతర పోషకాలను కూడా అందిస్తాయి.

చేపలు

సార్డినెస్, సాల్మన్, పిల్చర్డ్స్ వంటి చేపలు మన రోజువారీ కాల్షియం అవసరాలలో మూడింట ఒక వంతును కలిగి ఉంటాయి. ఇవి ఎముకలకు అవసరమైన కాల్షియానికి గొప్ప మూలం. సార్డినెస్ లో కాల్షియం కంటే విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.