కంటి ఆరోగ్యం దెబ్బతినడానికి ఎన్నో కారణాలున్నాయి. దీనివల్ల ఎన్నో కంటి సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా పోషకాల లోపం వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతిని కంటిచూపు తగ్గుతుంది.
కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అయితే ఎన్నో కారణాల వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. కంటి సమస్యలు కూడా వస్తాయి. మన శరీరానికి పోషకాలు చాలా చాలా అవసరం. ఈ పోషకాలు లోపించడం వల్ల రక్తహీనత నుంచి అలసట, నీరసం, లో బీపీ వంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అంతేకాదు పోషకాల లోపం వల్ల కళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కంటిచూపు తగ్గుతుంది. అందుకే మీ కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కంటిచూపు బాగుండాలంటే ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉసిరి
ఉసిరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజూ తింటే ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా కంటిచూపు కూడా మెరుగ్గా ఉంటుంది. కంటి సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇది జుట్టును నల్లగా ఉంచేందుకు సహాయపడుతుంది.
క్యారెట్లు
క్యారెట్లు కూడా కళ్ల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. దీనిలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యారెట్ ను క్రమం తప్పకుండా తినడం వల్ల కళ్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. క్యారెట్లలో విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఆకుకూరలు
ఆకుకూరలు మన మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పాలకూర వంటి ఆకుకూరలు తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇవి శరీర మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
బాదం పప్పులు
రోజూ కొన్ని బాదం పప్పులను తింటే బరువు తగ్గడంతో పాటుగా.. మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. బాదం పప్పుల్లో విటమిన్ ఇ, విటమిన్ సి, జింక్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా మంచివి.
చేపలు
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే సాల్మన్, సార్డినెస్ వంటి చేపలను తింటే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటిచూపు బాగుంటుంది. కొవ్వు చేపలు బరువు తగ్గేందుకు, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.
సిట్రస్ పండ్లు
నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి తో పాటుగా ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలోని విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పండ్లు కళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
గుడ్లు
గుడ్డు సంపూర్ణ ఆహారం. రోజూ ఒక గుడ్డును తింటే మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే వీటిని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. గుడ్లు కంటిచూపును మెరుగుపరుస్తాయి.
టమాటాలు
టమాటాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. టమోటాల్లో ఉండే లైకోపీన్ కళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. టమాటాల్లో ఉండే ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడం, బరువు తగ్గేందుకు సహాయపడటం వంటి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి.
