డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

ప్రకృతి సంపదలో మునగాకు ఒకటి. మనకు తరచూ చూస్తేనే ఉన్నవాటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేవి ఉంటాయి. వాటి గురించి తెలుసుకుని ఉపయోగించుకుంటే ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో గమనిద్దాం. మునగాకు లోని ఔషధోపయోగాల గురించి ఈ క్రింద కొంత వివరణ ఇచ్చాను. దీనిలోని  ఔషధోపయోగాల గురించి తెలుసుకుందాం. 


మునగకాయలు మరియు మునగ పువ్వుల ఉపయోగాలు తెలుసుకుందాం. 

  *  మునగ కాయలు, పచ్చి మామిడి కాయలు కలిపి వండిన కూర తినుచున్న వేసవిలో శరీరానికి చలవ చేకూరటయే గాక మన దేహము నందలి ఐరన్, విటమిన్ 'సి' లోపించకుండా ఉంటాయి. 

 *  మునగ పువ్వులను పాలలో వేసి కాగబెట్టి తాగుచున్న తాత్కాలిక నపుంసకత్వం తగ్గును. 

 *  ఒక స్పూన్ మునగ పువ్వుల రసమును ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తాగుచున్న ఉబ్బసానికి, అజీర్తికి మంచి ఔషధముగా పనిచేయును. 

 *  మూత్రపిండాల వ్యాధిలో సంబంధిత మందులతో పాటు లేత కొబ్బరి నీటిలో ఒక చెంచా మునగ పువ్వుల రసము కలిపి తాగుచున్న మంచి ఫలితాలు కలుగును. 

 *  ఒక కప్పు మునగాకు రసము బాగా వేడిచేసి చల్లార్చి పై పై నీటిని వంచేసి మిగిలిన పదార్ధములో పాలుపోసి కలిపి ఆ మిశ్రమాన్ని గర్భిణీలు గర్భము ధరించిన నాటి నుండి తీసుకొనుచున్న పిండము చక్కగా పెరుగుటయే కాక ప్రసవం సౌఖ్యముగా అగును. దీనిలో ఉన్న క్యాల్షియం , ఐరన్ , విటమిన్స్ బిడ్డ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడును. కేవలం గర్భిణీ స్త్రీలు మాత్రమే కాకుండా అన్ని వయసుల వారు స్త్రీ, పురుష బేధము లేకుండా టానిక్ లాగా వాడుకొనవచ్చు. ఈ మిశ్రమాన్ని బాలింతలకు ఇచ్చిన సమృద్దిగా పాలు ఉత్పత్తి అగును. ప్రసవానంతరం త్వరగా కోలుకుంటారు. 

 *  బాగా మరిగించి చల్లార్చిన మునగాకు రసం ఒక చెంచా మోతాదులో తీసుకుని ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ నందు కలుపుకుని తాగిన మూత్రవిసర్జనలో మంట, కొన్ని మూత్ర పిండాల వ్యాధులు, మలబద్దకం తగ్గును. 

 *  ఒక చెంచా మునగాకు రసములో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ పడుకునే ముందు తాగుచున్న రేచీకటి తగ్గును. ఇంకా ఙ్ఞాపకశక్తి కూడా పెరుగును . 

 *  పైన చెప్పిన మిశ్రమము నందు కొంచం నిమ్మరసం కూడా కలిపి తీసుకుంటే తలతిరుగుడు , మొలలు , ఎక్కిళ్లు , అజీర్ణం , తీసుకున్న ఆహారం శరీరానికి ఒంటబట్టకపోవడం వంటి సమస్యలు నివారణ అగును. 

 *  మునగాకు రసము నందు నువ్వులనూనె కలిపి నీరంతా ఆవిరి అయ్యేంత వరకు మరగకాచి ఆ మిశ్రమాన్ని గజ్జి, దురద వంటి చర్మవ్యాధులకు పైపూత ముందుగా రాయుచున్న చర్మవ్యాధులు అంతరించును. 

 *  మునగాకులను బాగా వేడిచేసి చిన్నచిన్న దెబ్బలకు, బెణుకు నొప్పుల పైన వేసి కట్టు కట్టిన నొప్పుల బాధలు తగ్గును. 

 *  మునగాకు రసములో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకున్న ముఖము పైన మొటిమలు నశించి ముఖచర్మం మృదువుగా అగును. 

 *  ఒకస్పూను మునగాకు రసములో 3 మిరియాలు పొడి చేసి కలిపి కణతలు పైన రాసుకున్న తలనొప్పి అంతరించును.