నీళ్లు తక్కువ తాగితే బరువు పెరుగుతారనేది నిజమేనా?

ఉన్న బరువు పెరగకుండా ఉండటానికి, బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొంతమంది నీళ్లు తక్కువగా తాగడం వల్ల కూడా బరువు పెరిగిపోతామని చెప్తుంటారు. దీనిలో నిజమెంతుందో తెలుసా? 

 Does dehydration Increase Weight rsl

బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా బరువు తగ్గడం లేదని బాధపడేవారు ఎంతో మంది ఉన్నారు. బరువు తగ్గేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. బరువు తగ్గడం లేదంటే మీరు కొన్ని తప్పులు చేస్తున్నట్టేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

బరువు తగ్గాలనుకునేవారు ఒత్తిడికి దూరంగా ఉండాలి. అలాగే బయటి ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఇంట్లో వండిని హెల్తీ ఫుడ్ ను మాత్రమే తినాలి. అలాగే మర్చిపోకుండా ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించాలి. అలాగే వేయించిన ఆహారాలను మొత్తమే తినకూడదు. ఇవన్ని చేసినా.. మన నిత్యజీవితంలో చేసే కొన్ని పొరపాట్ల వల్ల బరువు మరింత పెరుగుతారు తప్ప తగ్గరు. ఇలాంటి వాటిలో శరీరంలో నీళ్లు తగ్గడం ఒకటి. అవును శరీరంలో నీటి కొరత ఉంటే మీరు బరువు పెరుగుతారని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

 Does dehydration Increase Weight rsl

డీహైడ్రేషన్ బరువు పెరగడానికి కారణమవుతుందా?

బాడీ డీహైడ్రేషన్ అయితే కూడా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. మీరు వెయిట్ పెరగడం నిర్జలీకరణానికి సంకేతం. మీరు బరువు తగ్గాలంటే మాత్రం ఖచ్చితంగా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. నీరు ఒక్క బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. మన మొత్తం ఆరోగ్యానికి చాలా అవసరం. 

నీళ్లను పుష్కలంగా తాగితే మీరు కేలరీను తక్కువగా తీసుకుంటారు. ఇది మీరు బరువు తగ్గేలా చేయడానికి సహాయపడుతుంది. ఒకవేళ మీ శరీరం డీహైడ్రేషన్ కు గురైనప్పుడు మీ జీవక్రియను తగ్గుతుంది. దీంతో మీకు ఆహార కోరికలు బాగా పెరిగి ఎక్కువగా తినడం మొదలుపెడతారు. దీంతో మీరు విపరీతంగా బరువు పెరుగుతారు. కాబట్టి నీళ్లను పుష్కలంగా తాగాలి. 

డీహైడ్రేషన్ ను ఎలా గుర్తించాలి?

మీ శరీరం డీహైడ్రేట్ అయ్యిందనడాన్ని గుర్తించడం చాలా సులువు. ఇందుకోసం మీరు చేతుల చర్మాన్ని గట్టిగా పట్టుకొని లాగి వదలండి. మీ చర్మం 2 సెకన్లలో నార్మల్ గా కాకపోతే మీ బాడీ డీహైడ్రేషన్ కు గురైందని అర్థం చేసుకోండి. మీ శరీరంలో నీళ్లు తక్కువగా ఉండటం వల్ల నిద్రమత్తు ఎక్కువగా ఉంటుంది. అలాగే మైకంగా కూడా ఉంటుంది. అలాగే మీరు మూత్రవిసర్జన తక్కువగా చేస్తారు. అలాగే నోరు పొడిబారడంతో పాటుగా ఎన్నో సమస్యలు వస్తాయి. 

 Does dehydration Increase Weight rsl

హైడ్రేటెడ్ గా ఉండాలంటే ఏం చేయాలి? 

మీరు హైడ్రేట్ గా ఉంటేనే మీ శరీరం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి హైడ్రేటెడ్ గా ఉండటానికి రోజూ పుష్కలంగా నీళ్లను తాగండి. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లను మీ రోజువారి ఆహారంలో చేర్చుకోండి. నీళ్లతో పాటుగా కొబ్బరి నీళ్లను కూడా తాగడం అలవాటు చేసుకోండి. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే కొకొనట్ వాటర్ లో పొటాషియం, ఎలక్ట్రోలైట్స్  పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 

బరువు తగ్గడానికి ఏ సీజన్ బెస్ట్?

మీరు బరువు తగ్గడానికి వేసవి కాలం బాగా సహాయపడుతుంది. ఎందుకంటే ఈ సీజన్ లో వాకింగ్ తో పాటుగా స్విమ్మింగ్ వంటి తేలికపాటి ఏరోబిక్ ఎక్సర్ సైజులు ఎలాంటి కష్టం లేకుండా చేయొచ్చు. వేసవిలో మీరు బరువు తగ్గాలంటే కేలరీలు తక్కువగా ఉండే పండ్లను, కూరగాయలను మీ డైట్ లో చేర్చుకోవాలి. పలు అధ్యయనాల ప్రకారం.. మీరు సహజంగా బరువు తగ్గడానికి శీతాకాలం కూడా సహాయపడుతుంది. 

బరువు పెరగడానికి ఏ సీజన్ బెస్ట్?

ఏ సీజన్ లో అయినా బరువు పెరుగుతారు. కానీ ఎండాకాలంలో కంటే చలికాలంలో బరువు ఎక్కువగా పెరుగుతారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల చలికాలంలో బరువు పెరుగుతారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మీరు బరువు పెరగాలంటే మీకు చలికాలం బాగా ఉపయోగపడుతుంది. 

రోజూ ఎన్ని నిమిషాలు వ్యాయామం చేస్తే బరువు తగ్గుతారు? 

వ్యాయామం మీ బరువును తగ్గించడానికే కాకుండా.. మిమ్మల్ని ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. రోజూ వ్యాయామం చేయడం వల్ల మీరు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అయితే చాలా మంది బరువు తగ్గాలని ప్రతిరోజూ వ్యాయామం చేస్తుంటారు. కొంతమంది జాగింగ్, రన్నింగ్ చేస్తుంటారు. ఇవి కూడా అదనపు బరువును బాగా తగ్గిస్తాయి. 30 నిమిషాల పాటు జాగింగ్ చేయడం వల్ల మీ శరీరంలో 223 నుంచి 400 లేదా అంతకంటే ఎక్కువ కేలరీలు కరుగుతాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

 Does dehydration Increase Weight rsl

జాగింగ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాగింగ్ మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. రోజూ జాగింగ్ చేయడం వల్ల మీకు గుండె సంబంధిత వ్యాధులొచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే జాగింగ్ మీరు ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చేస్తుంది. జాగింగ్ వల్ల కేలరీలు ఎక్కువగా కరిగి మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 

అలాగే జాగింగ్ తో ఎముకలు, కండరాలు బలంగా ఉంటాయి . ముఖ్యంగా ఇది దిగువ ఎముకలను, కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అలాగే జాగింగ్ ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలాగే మీకు రాత్రిళ్లు బాగా నిద్రపట్టడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా జాగింగ్ తో మీ శరీర శక్తి పెరుగుతుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios