డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

ప్రస్తుత కాలంలో కరోనా వైరస్ సరిగ్గా సంవత్సరానికి సెకండ్ వేవ్ ప్రభావం కనబడుతూనే ఉంది. కరోనాకు బయపడనవసరం లేదు, జాగ్రత్త పడితే చాలు. మాస్కులు దరించకుండ బయటకు వెళ్ళవద్దు. తరచూ చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. సాధ్యమైనంత వరకు విందు, వినోదాల తిండ్లకు దూరంగా ఉండాలి. మైదా పిండితో తయారుచేసిన పదార్ధాలు తినకూడదు, జంక్ ఫుడ్ అస్సలు వాడవద్దు. భౌతిక దూరం పాటించాలి. సరైన తిండితోనే శరీరంలోని జీవక్రియలన్నీ సజావుగా జరుగుతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలికి అలవాటు పడాలి. అవి ఏమిటో కొన్ని తెలుసుకుందాం.

నీళ్లు :- రక్త ప్రసరణలో భాగంగా మన శరీర జీవక్రియల ద్వారా తయారైన వ్యర్థాలు, హానికర పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. ఇందుకోసం తగినన్ని నీళ్లు అవసరం. నీటివల్ల శరీర ఉష్ణోగ్రత తగినట్టుగా ఉంటుంది. మల, మూత్ర విసర్జనలు సాఫీగా సాగుతాయి. తరచూ గొంతు తడుపుతుంటే కరోనా వైరస్ సోకదు , హానిచేయాడు. ఉదయం పరిగడుపున గోరువెచ్చని నీళ్ళు త్రాగుటే అనేక రుగ్మతులను నివారణ చేస్తుంది.

ఆహారం :- మనం తీసుకునే ఆహారమే ప్రధాన ఔషధం. రోజుకు రెండుసార్లు తినేవాళ్లను మితాహారులంటారు. ఆ ఆహారం నాణ్యంగా ఉండటమూ ముఖ్యమే. ఆకలి అయినప్పుడు మాత్రమే తినాలి. కడుపులో మూడు భాగాలు నాణ్యమైన ఆహారంతో, నీటితో నింపాలి. నాలుగో భాగం ఖాళీగా ఉంచాలి.

ఉపవాసం:- ఉపవాసం ద్వారా జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి దొరుకుతుంది. ఉపవాసం మనసులోని మాలిన్యాలను కూడా తొలగిస్తుంది. ఆ సమయంలో చిత్తం ప్రశాంతంగా ఉంటుంది.

యోగా 'ధ్యానం" వ్యాయామం :- వ్యాయామం రోజువారీ జీవితంలో భాగం కావాలి. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం అన్నీ కలిపితేనే సంపూర్ణ యోగా అవుతుంది. దీనివల్ల కీళ్లన్నీ ఫ్లెక్సిబుల్‌ అవుతాయి. బరువు నియంత్రణలో ఉంటుంది. వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

దైవ ప్రార్థన :- దైవ ప్రార్థన కూడా ఆరోగ్య సూత్రమే. మనసును స్వచ్ఛం చేస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటేనే శారీరక వ్యాధులు దూరమవుతాయి. హార్మోన్లు సమతుల్యమవుతాయి. దేవుని పూజలో దీపం, దూపం, నైవేద్యం ఇవ్వన్ని ఆరోగ్యాన్ని కలిగించేవే.

గమనిక :- మన ఆరోగ్యం మన చేతులలో ఉంటుంది. ఏ వ్యాదికైనా మందు దొరుకుతుంది కానీ మనోవ్యాధికి మందు అనేది లేదు కాబట్టి మనిషి మొదట మానసిక రోగి ఔతాడు, దని ప్రభావంతోనే శారీరక రోగి అవుతాడు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనుకుంటే పై తెలిపిన ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఆనందమయమైన ఆరోగ్యాన్ని పొందండి.