అసలే ఇది జ్వరాల సీజన్‌. ఏ జ్వరం వచ్చినా ఒక పట్టాన వదలదు. దానికితోడు కీళ్ల నొప్పులతో వచ్చే చికెన్‌ గున్యా జ్వరమంటే నరకప్రాయమే. అయితే కొన్ని రకాల ఔషధాలు శక్తివంతంగా వ్యాధి లక్షణాలను తగ్గించి, రోగికి కొంచెం ఉపశమనం అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

చికెన్‌ గున్యా వలన కలిగే కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి, లవంగాల నూనె, వెల్లుల్లి పేస్ట్‌ను పేపర్‌ సహాయంతో కీళ్లు, మోకాళ్లపైన రాయాలి. అశ్వగంథను నమలడం వల్ల కూడా ఉపశమనం పొందవచ్చు

ఎప్సం సాల్ట్‌ (మెగ్నీషియం సల్ఫేట్‌) ను గోరు వెచ్చని నీటిలో కలిపి, వేప ఆకులను కూడా వేసి స్నానం చేయాలి. ద్రాక్ష పండ్లను కొద్దిగా ఆవు పాలలో కలుపుకొని తినటం వలన చికెన్‌ గున్యా వలన కలిగే కీళ్ళనొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. వీటిలో వాడే ద్రాక్ష పండ్లు విత్తనాలు లేకుండా పొడిగా ఉండాలి.

చికెన్‌ గున్యాతో భాదపడేవారు క్యారెట్‌, ఇతర సలాడ్‌లను తినటం వలనరోగ నిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. ఫలితంగా కీళ్ళనోప్పుల నుండి ఉపశమనం పొందుతారు. చికెన్‌ గున్యా వ్యాధి గ్రస్తులు తులసి ఆకులను నమలాలి. ఇది జ్వరాన్ని తగ్గించి, రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారటంలో సహాయపడుతుంది.

 చికెన్‌ గున్యా సోకిన వ్యక్తులు కొబ్బరి నీటిని ఎక్కువగా తాగాలి. కొబ్బరి నీరు చికెన్‌ గున్యాను తగ్గించదు కానీ, రోగి త్వరగా కోలుకోటానికి సహాయపడుతుంది. కొబ్బరి నీరు కాలేయాన్ని డిటాక్సిఫికేషన్‌కు గురి చేసి, దాని ఆరోగ్యాన్ని మెరుగుపరచి, వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది.