Asianet News TeluguAsianet News Telugu

ఎప్పుడూ ఆకలి కావడానికి, అతిగా తినడానికి కారణాలు ఇవే..!

కొంతమంది కడుపు నిండా కూడా ఇంకా తింటూనే ఉంటారు. కారణం ఇంకా ఆకలి కావడం. అయితే ఇలా ఆకలి తీరకపోవడానికి, ఇంకా తినాలనిపించడానికి కారణాలు చాలానే ఉన్నాయి తెలుసా? 
 

Causes of overeating rsl
Author
First Published Mar 19, 2023, 3:19 PM IST

విచారం, సంతోషం, బాధ అంటూ ఎలాంటి భావోద్వేగానికి గురైనా కొంతమంది ఫస్ట్ చేసే పని తినడం. కొంతమందికి కడుపు నిండినా ఇంకా తింటూనే ఉంటారు. ఎందుకంటే వీరికి ఎప్పుడూ ఆకలి అవుతూనే ఉంటుంది. అతిగా తినడం కూడా ఒక సమస్యేనంటున్నారు నిపుణులు. అతిగా  తినడం వల్ల ఎక్కడ లేని రోగాలు వస్తాయి. ముఖ్యంగా ఊబకాయం బారిన పడతారు. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయి. దీనివల్ల డయాబెటీస్, గుండె జబ్బులు, గుండె పోటు, కొన్ని రకాల క్యాన్సర్లు అంటూ ఎన్నో రోగాలు వస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎప్పుడూ ఎందుకు ఆకలిగా అనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పోషక లోపాలు

అప్పుడప్పుడు అతిగా తినడానికి  ఎన్నో కారణాలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రధాన కారణాల్లో పోషక లోపం ఒకటి. అంతేకాదు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి కొన్ని సూక్ష్మపోషకాలు మీ శరీరంలో లేకపోవడం వల్ల మీరు అతిగా తింటారు. ముఖ్యంగా జున్ను నుంచి చాక్లెట్, ఫ్రైస్ వరకు ప్రతిదాన్ని మీకు తినాలనిపిస్తుంది. అతిగా తినకుండా ఉండాలంటే మీరు తినే ఆహారంలో అవసరమైన అన్ని పోషకాలు ఉండేలా చూసుకోండి. 

ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం

ఆల్కహాల్ కూడా ఆకలిని పెంచుతుందని తేలింది. ఒకటి లేదా రెండు గ్లాసుల మందును తాగడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఇంతకంటే ఎక్కువ తాగడం, రోజూ తాగడం వల్ల మీ ఆకలి బాగా పెరుగుతుంది. ఎక్కువగా తాగే వారు ఉప్పుగా లేదా కొవ్వు స్నాక్స్ ను ఎక్కువగా తినే అవకాశం ఉంది. మందు మీరు అతిగా తినడానికి దారితీస్తుంది. మీరు త్రాగే గ్లాసుల సంఖ్యను తగ్గించడం లేదా మొత్తమే మానేయడం వల్ల మీరు అతిగా తినే అవకాశం తగ్గుతుంది. 

ఒత్తిడి 

మన హార్మోన్లు ఆకలితో సంబంధం కలిగి ఉంటాయి. మనం ఒత్తిడికి గురైనప్పుడు కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయి పెరుగుతుంది. అలాగే మన ఆకలి కూడా పెరుగుతుంది. దీంతో కొవ్వు, కేలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్ నే తినాలనిపిస్తుంది. ఒత్తిడి వల్ల తినడం సర్వసాధారణం. కానీ దీనివల్ల  ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఫుడ్ ను తినడానికి బదులు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ సలహాను తీసుకోండి. యోగా, ధ్యానం చేసినా ఒత్తిడి తగ్గుతుంది. 

హార్మోన్ల అసమతుల్యత

సమతుల్య ఆహారం మన శరీరం బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. కానీ మన శరీరానికి తగినంత పోషణ లభించకపోతే.. శరీరం ఆకలి హార్మోన్ గ్రెలిన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మీ శరీరానికి పోషకాహారం అవసరమని సూచిస్తుంది. ఇది ఉత్పత్తి అయినప్పుడు మీకు ఆకలిగా అనిపిస్తుంది. ఇది అతిగా తినడానికి దారితీస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios