Asianet News TeluguAsianet News Telugu

నారింజ కూడా స్ట్రెస్ ని తగ్గిస్తుందా?

నారింజ రుచి అద్బుతంగా ఉంటుంది. దీనిలో పోషకాలు మెండుగా ఉంటాయి. అయితే ఈ పండు కూడా ఒత్తిడిని, ఆందోళనను వెంటనే తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి దీనిలో నిజమెంతంటే..
 

Can oranges reduce stress and anxiety?
Author
First Published Mar 17, 2023, 7:15 AM IST

నారింజ పండు టేస్టీగా ఉంటుంది. ఈ పండును అనేక విధాలుగా ఆస్వాదించొచ్చు. కానీ దీనిలో అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ పండును ఆరోగ్యకరమైన చిరుతిండికి, సలాడ్ల రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. నారింజ రసాలు, స్మూతీలు, కాక్టెయిల్స్ వంటి వివిధ పానీయాలలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నారింజ పండు కూడా ఒత్తిడి, ఆందోళన స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.

నారింజ పండు కూడా మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఈ పండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల పునరుత్పత్తిని మెరుగుపరుస్తాయి. జలుబు,  ఫ్లూను నివారించడానికి సహాయపడతాయి. 

నారింజలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది గట్ ఆరోగ్యానికి, జీర్ణక్రియకు చాలా చాలా మంచిది. నారింజ పండును తినడం వల్ల మెదడు ఆరోగ్యం కూడా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. 

ప్రతిరోజూ నారింజ పండ్లను తినడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. నారింజ తినడం మీ శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.  స్థిరమైన ఒత్తిడి కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది శరీరం ముఖ్యమైన పనితీరును ప్రభావితం చేస్తుంది. అందుకే ఒత్తిడిని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి.

నారింజ పండును తిన్నా లేదా నారింజ రసాన్ని తాగినా మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే ఒత్తిడి స్థాయిలు చాలా వరకు తగ్గుతాయి. ఎందుకంటే  తాజా నారింజ దాని సిట్రస్ రుచి మెదడులో సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. 

నారింజను క్రమం తప్పకుండా తినడం వల్ల మెదడులో కణాల పునరుత్పత్తి కూడా మెరుగుపడుతుంది. ఇది అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అందుకే ఒత్తిడికి గురైన ప్రతిసారి కార్టిసాల్ స్థాయిలను తగ్గించడానికి, సెరోటోనిన్ స్థాయిలను పెంచడానికి నారింజ పండును తినండి. లేదా నారింజ రసాన్ని తాగండి. 


 

Follow Us:
Download App:
  • android
  • ios