కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేసింది. ఈ మహమ్మారి నుంచి ప్రపంచానికి ఎప్పుడు విముక్తి దొరుకుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదరుచూశారు. అయితే.. ఆ రోజులు మరెంతో దూరంలో లేవని ప్రభుత్వాలు చెబుతున్నాయి. భారత్ లోనూ నూతన సంవత్సరంలో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ముందుగా ఎవరికి ఇస్తారు..? గర్భిణీలకు వ్యాక్సిన్ ఇస్తారా ఇలా చాలా అనుమానాలే ఉన్నాయి ప్రజల్లో. మరి ఆ ప్రశ్నలేంటి..? వాటికి సమాధానాలేంటో ఇప్పుడు చూద్దాం..

1. కరోనా వ్యాక్సిన్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది..?

భారత్ లో కరోనా వ్యాక్సిన్ జనవరిలో అందుబాటులోకి వస్తుంది. తొలుత ప్రభుత్వం వద్ద మాత్రమే ఉండనుంది. ఇక ప్రైవేటు సంస్థల వద్దకి అంటే.. మార్చి నెలలోకి వస్తుంది.

2.కరోనా వ్యాక్సిన్ అందరూ తీసుకోవాలా..?

కచ్చితంగా కరోనా వ్యాక్సిన్ అందరూ తీసుకోవాలి.

3.కరోనా వ్యాక్సిన్ మొదట ఎవరికి ఇవ్వనున్నారు..?

ఈ వ్యాక్సిన్ తొలుత కరోనా రోగులకు వైద్యం అందిస్తున్నా వైద్య సిబ్బందికి ముందుగా ఇవ్వనున్నారు. ఆ తర్వాత సివిల్ సర్వెంట్స్, పోలీసులు, ఆర్మీ, రాజకీయ నాయకులు వారి బంధువులకు ముందుగా వ్యాక్సిన్ అందుతుంది. ఆ తర్వాత 50 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తర్వాత అందరికీ అందుతుంది.

4.వ్యాక్సిన్ ఎలా పంపిణీ చేస్తారు..?
 పబ్లిక్, ప్రైవేటు సెంటర్ ల దర్వారా.. డాక్టర్లు, డెంటిస్టులు, నర్సుల ద్వారా అందిస్తారు.

5.ఎన్ని డోసులు ఇస్తారు..?

మొత్తం కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు ఇస్తారు. మొదటి డోస్ ఇచ్చిన 21 లేదా 28 రోజులకు మరో డోస్ ఇస్తారు.

6.కేవలం ఒక్క డోస్ తీసుకుంటే ఏమౌతుంది..?

కేవలం ఒక్క డోస్ మాత్రమే తీసుకుంటే.. కరోనా నుంచి పూర్తి రక్షణ లభించదు. కేవలం 60 నుంచి 80శాతం రక్షణ మాత్రమే లభిస్తుంది. కాబట్టి కచ్చితంగా రెండు డోసులు తీసుకోవాలి.

7.సెకండ్ డోస్ తీసుకోవడం మర్చిపోతే..? మళ్లీ ఫస్ట్ డోస్ తీసుకోవాలా..?

సెకండ్ డోస్ మర్చిపోతే.. వెంటనే మళ్లీ దానిని తీసుకోవాల్సి ఉంటుంది. మళ్లీ ఫస్ట్ డోస్ తీసుకోవాల్సిన అవసరం లేదు.

8. గర్భిణీ స్త్రీలు కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా..? ఏదైనా ప్రమాదం ఉంటుందా?
 గర్భిణీ స్త్రీలు  వ్యాక్సిన్ తీసుకోకూడదట. అంతేకాదు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కనీసం రెండు, మూడు నెలలు  తర్వాతే గర్భం దాల్చాలట. అంతకన్నా ముందు గర్భం కూడా దాల్చడానికి వీలు లేదట.

9. డయాబెటిక్ పేషెంట్స్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా..?

కచ్చితంగా తీసుకోవచ్చు. ముందుగా తీసుకోవాల్సింది వాళ్లే. వాళ్లకి కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్లు కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి.