బిడ్డకు పాలిస్తే రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలు అధ్యయనాలు నిరూపించాయి. ఇది తల్లికి, బిడ్డకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
పిల్లలకు తల్లిపాలే పోషణ. ఇవే వారు ఆరోగ్యంగా ఉండేందుకు, పెరిగేందుకు సహాయపడతాయి. పాలు శిశువుకు అవసరమైన పోషకాలను, రోగనిరోధక రక్షణను అందించడమే కాకుండా.. తల్లికి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. దీనిలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే సామర్థ్యం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
రొమ్ము కణజాలంలో ఏర్పడే క్యాన్సర్ ను రొమ్ము క్యాన్సర్ అంటారు. ఈ క్యాన్సర్ పురుషులకు, మహిళలకు కూడా వస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా మహిళలకు వచ్చే అత్యంత సాధారణ రకం క్యాన్సర్. 2020 లో 2.3 మిలియన్ల కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయని సర్వేలు వెల్లడించాయి. అయితే బిడ్డకు పాలివ్వడం వల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని అనేక పరిశోధనలు కనుగొన్నాయి. ఒక మహిళ ఎక్కువసేపు తల్లి పాలివ్వడం వల్ల రక్షణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
తల్లి పాలివ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు
తల్లి పాలివ్వడంలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే ఎన్నో విధానాలు ఉన్నాయి. మొదటిది ఇది స్త్రీ తన జీవితకాలంలో కలిగున్న రుతుచక్రాల సంఖ్యను తగ్గిస్తుంది. అయితే రుతుస్రావం రొమ్ము కణజాలాన్ని ప్రేరేపిస్తుంది. ఇది అసాధారణ కణాల పెరుగుదలకు దారితీస్తుంది. ఇది చివరికి క్యాన్సర్ గా మారుతుంది. స్త్రీ బిడ్డకు పాలిస్తే ఈ రుతు చక్రాల సంఖ్య తగ్గుతుంది. దీంతో రొమ్ము క్యాన్సర్ ను ప్రోత్సహించే హార్మోన్లకు గురైన రొమ్ము కణజాల పరిమాణం తగ్గితుంది.
రెండవది.. పాలివ్వడం వల్ల రొమ్ము కణజాలంలో మార్పులు వస్తాయి. ఇది క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. పాలిచ్చేటప్పుడు రొమ్ము కణజాలం ఇన్వల్యూషన్ అని పిలువబడే ప్రక్రియకు లోనవుతుంది. అంటే అక్కడ పాలను ఉత్పత్తి చేసే కణాలు కొవ్వు కణాలతో భర్తీ చేయబడతాయి. ఈ ప్రక్రియ రుతుచక్రం సమయంలో అభివృద్ధి చెందిన ఏదైనా అసాధారణ కణాలను తొలగించగలదు. ఇది రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మూడవది.. పాలివ్వడం వల్ల స్త్రీల శరీరంలో ఈస్ట్రోజెన్ మొత్తం తగ్గుతుంది. ఈస్ట్రోజెన్ అనేది రొమ్ము కణజాలం పెరుగుదలను ప్రోత్సహించే హార్మోన్. ఈ ఈస్ట్రోజెన్ ఎక్కువగా ఉంటే రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గిస్తే క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. పాలిస్తే రొమ్ము కణజాలంలో క్యాన్సర్ కణాల పెరుగుదల తగ్గుతుంది.
పాలివ్వని మహిళలతో పోలిస్తే కనీసం ఆరు నెలలు తల్లి పాలివ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం 5 శాతం తగ్గుతుందని ఒక అధ్యయనం కనుగొంది. మరొక అధ్యయనం 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాలివ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం 20 శాతం వరకు తగ్గుతుందని కనుగొన్నారు. ఎక్కువ కాలం పాలిచ్చే మహిళలకు, ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలకు పాలిచ్చే మహిళలకు ఈ క్యాన్సర్ ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది.
తల్లులు బిడ్డకు తల్లి పాలివ్వడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు
పాలివ్వడం వల్ల తల్లికీ, బిడ్డకూ ఇద్దరికీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. తల్లి పాలలో అంటువ్యాధులు, అనారోగ్యాల నుంచి శిశువును రక్షించే ప్రతిరోధకాలు ఉంటాయి. ఈ పాలు సులువుగా జీర్ణమవుతాయి. మొదటి ఆరు నెలల్లో శిశువుకు అవసరమైన అన్ని పోషకాలను తల్లిపాలే అందిస్తాయి. తల్లి పాలివ్వడం వల్ల బాల్యంలో వచ్చే ఊబకాయం ప్రమాదం తగ్గుతుంది. ఈ పాలు పిల్లలలో అభిజ్ఞా అభివృద్ధిని మెరుగుపరుస్తుంది. పాలివ్వడం వల్ల తల్లులలో ఎముక సాంద్రత పెరుగుతుందని, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుందని అలాగే తల్లులలో ప్రసవానంతర నిరాశను తగ్గిస్తుందని తేలింది.
