Asianet News TeluguAsianet News Telugu

ఆ పనిచేసేవారికే అధిక రక్తపోటు..!

వారానికి 35గంటల కన్నా తక్కువ పనిచేసే ఉద్యోగులతో పోలిస్తే 49 కంటే ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల 70శాతం ఎక్కువ తెలియని రక్తపోటు వచ్చే అవకాశం ఉందని గుర్తించింది.

A review of the cost of cardiovascular disease
Author
Hyderabad, First Published Nov 27, 2020, 10:07 AM IST

ఒకప్పుడు ఐదు పదులు దాటిన వారు మాత్రమే హార్ట్ ఎటాక్ బారినపడేవారు. కానీ.. ప్రస్తుత కాలంలో.. వయసు తేడా లేకుండా.. ప్రతి ఒక్కరూ దీని బారినపడుతున్నారు. మూడు పదులు నిండని వారు కూడా.. గుండె నొప్పితో చనిపోతున్న రోజులువి. అయితే.. దీనిపై ఓ సంస్థ చేపట్టిన సర్వేలో పలు  విషయాలు తెలిసాయి.

 ఆఫీసుల్లో సాధారణ పనిగంటల కంటే ఎక్కువ సమయం గడిపే వారిలో అధిక రక్తపోటు ఉంటోందని ఓ అధ్యయనంలో స్పష్టమైంది. తమకు హైబీపీ ఉన్న విషయం, దాని వల్ల కలిగే అనార్థాలను వీరు కనిపెట్టలేరని ఓ అధ్యయనంలో తేలింది. బీపీ ఎక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తేలింది.  ఏదో తెలియని ఇబ్బంది అనిపించినా.. వైద్యులకు చూపించుకున్నా కూడా.. వారిలో హైబీపీ ఉన్న విషయం అంత సులభంగా బయటపడటం లేదట.

కెనడియన్ పరిశోధనా బృందం భారతదేశంతోపాటు వివిధ దేశాల్లో దీనిపై అధ్యయనం చేయగా.. పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి వారానికి 35గంటల కన్నా తక్కువ పనిచేసే ఉద్యోగులతో పోలిస్తే 49 కంటే ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల 70శాతం ఎక్కువ తెలియని రక్తపోటు వచ్చే అవకాశం ఉందని గుర్తించింది.

వీరిలో పెరిగిన రక్తపోటు రీడింగ్ లను తెలుసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుందని.. అందువల్ల వారికి రక్తపోటు లేదనే భావనలోనే ఉండిపోతున్నారని వారు చెబుతున్నారు. శరీరంలో మార్పులు తీవ్రమైన తర్వాత  అది బయటపడుతోందని  పరిశోధకులు చెబుతున్నారు.

ప్రతి వారం 41 నుంచి 48 గంటలు పనిచేసే వ్యక్తులు తెలియని రక్తపోటు (ముసుగు రక్తపోటు) బారిన పడటానికి 54 శాతం ఎక్కువ అవకాశం ఉందని అధ్యయనంలో స్పష్టమైంది.ఉద్యోగుల్లో తెలియని విధంగా ఉండే రక్తపోటు వల్ల వారిలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నట్టు వైద్యులు స్పష్టం చేశారు.

ఈ అధ్యయనంలో ఉద్యోగులను బృందాలుగా విభజించి కొన్నేళ్లపాటు పదేపదే పరీక్షలు జరిపారు.ఎక్కువ పని గంటలు తమ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని ఉద్యోగులు చాలామందికి ముందే తెలుసని అధ్యయనంలో తేలింది.అయితే దీన్ని నియంత్రించుకోవడానికి, తగ్గించుకోవడానికి అవసరమైన పరిస్థితులు ఉండడం లేదని గుర్తించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios