విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరిలో టిడిపి నాయకునిపై  వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) నేత  కత్తితో దాడి చేశాడు. మంగళగిరి పట్టణంలోని 32వ వార్డు అజయ్ నగర్ లో టిడిపి వార్డు ప్రసిడెంట్, ఆటో డ్రైవర్ బందెల కాంతరావపై  కత్తితో దాడి చేశాడు. 

ఇంటి వద్ద జరిగిన వివాదంలో ఆదే వార్డుకు చెందిన వైకాపా  మాజీ కౌన్సిలర్,  అమె భర్త , మరో ఇద్దరూ  దాడి చేసినట్లుగా పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్సకై తరలించారు. 

అయితే పరిస్దితి  విషమంగా ఉండటంతో బాధితుడుని మెరుగైన చికిత్స కోసం  గుంటూరు జిజిహెచ్ కు తరలించారు. కేసు తీవ్రతను తగ్గించేందుకు రాజకీయ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.