గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణం జరిగింది. ఓ మహిళపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యూనివర్సిటీ సర్టిఫికెట్ విషయంలో యువకులతో ఆ మహిళకు పరిచయమైనట్లుగా తెలుస్తోంది.

అనంతరం నమ్మించి వారు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.