గుంటూరు జిల్లా ముప్పాళ్లలో దారుణం జరిగింది. కొడుకును ఉద్యోగం నుంచి తొలగించారనే మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.

వివరాల్లోకి వెళితే.. మండలంలోని పలుదేవర్లపాడుకు చెందిన సువార్తమ్మ కుమారుడు రమేశ్‌ను విద్యుత్ సబ్‌స్టేషన్ ఉద్యోగం నుంచి అధికారులు తొలగించి మరొకరిని నియమించారు. అధికారుల నిర్వహకంపై రమేశ్ కోర్టును ఆశ్రయించాడు.

న్యాయస్థానం సైతం రమేష్ ను విధులోకి చేర్చుకోవలంటు ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఉత్త్వరులు ఇచ్చినప్పటికీ  కోడుకును విధులోకి తీసుకోకపోవటంపై సువార్తమ్మ తీవ్ర మనస్తాపానికి గురైంది.

ఈ క్రమంలో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.