గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం 5వ మైలు వద్ద ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది.  ఆమెను ఏటుకూరు గ్రామానికి చెందిన శ్రీలక్ష్మిగా గుర్తించారు. శ్రీలక్ష్మి 5మైలు వద్ద  పోలంలో దారుణంగా హత్యకు గురైంది. 

శ్రీలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది పొలంలో శ్రీలక్ష్మీ మృతదేహం ప్రక్కన కొండేపాడు గ్రామానికి చెందినయువకుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతను పురుగుల మందు చేవించి అపస్మారక స్దితిలోకి వెళ్లినట్లు గుర్తించారు. అతన్ని పోలీసులు గుంటూరు జిజిహెచ్ కి తరలించారు.  

అతనే మహిళను హత్య చేసి వుంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసు విచారణ జరుపుతున్నారు.