Asianet News TeluguAsianet News Telugu

అమరావతిలో జగన్ నివసిస్తున్న ఇల్లు ఎవరిదంటే: వర్ల రామయ్య సంచలనం

రాజధాని అమరావతి ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, సీఎం జగన్ కట్టుకున్న ఇంటిపై టిడిపి నేత వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు.  

Varla Ramaiah Sensational Comments Over CM YS Jagan amaravati house
Author
Guntur, First Published Jan 3, 2020, 7:19 PM IST

చెప్పేది శ్రీరంగనీతులు దూరేది డాష్‌,డాష్‌ అన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్‌ వ్యవహారశైలి ఉందని టిడిపి సినియర్ నాయకులు, పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య ఎద్దేవా చేశారు. 11కేసుల్లో ముద్దాయిగా ఉన్నవ్యక్తి, తనపై ఉన్న ఛార్జ్‌షీట్లకు సంబంధించి అవినీతి నిరోధకశాఖ విచారణ ఎదుర్కొంటున్న జగన్‌ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారుల్ని మందలించడం సిగ్గుచేటని రామయ్య మండిపడ్డారు. 

శుక్రవారం ఆయన ఆత్మకూరులోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్‌లాంటివాళ్లు అధికారపీఠాలు అధిరోహిస్తారని దివంగత అంబేద్కర్‌కు తెలిసుంటే రాజ్యాంగంలో ఎక్కడో ఒకచోట అలాంటివాళ్లకు అధికారం దక్కకుండా చేసేవారన్నారు. తాడేపల్లిలో జగన్‌ ఉంటున్న ఇల్లు జగన్ ది కాదు ఆయన బినామీదని వర్ల తెలిపారు. 

తమ నాయకుడు అమరావతిలో ఇల్లుకట్టుకున్నాడని, చంద్రబాబుకి ఇల్లు లేదని గొప్పలుచెప్పుకుంటున్న వైసీపీ నేతలు ఇప్పుడేం మాట్లాడతారని వర్ల ప్రశ్నించారు. తనదికాని ఇంటి మరమ్మతుల కోసం రూ.42కోట్ల ప్రజాధనాన్ని జగన్‌ దుర్వినియోగం చేశాడని, ఆ సొమ్ము ఆయన తాత రాజారెడ్డో, తండ్రి రాజశేఖర్‌రెడ్డో ఇవ్వలేదన్నారు. 

చంద్రబాబు అధికారంలో ఉన్నా అద్దెఇంట్లోనే ఉన్నాడని, ఆఇంటికి ఏనాడూ ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్కరూపాయి కూడా ఖర్చుచేయలేదన్నారు. ప్రజలసొమ్ముని బినామీ ఇంటికి ఖర్చుచేసిన జగన్‌ నీతిసూత్రాలు వల్లిస్తుంటే ప్రజలంతా వినాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. ఛీటింగ్‌ , మనీలాండరింగ్‌ కేసుల్లో ముద్దాయిగా ఉండి లక్షలకోట్లు కాజేసిన వ్యక్తి ఏ హక్కుతో అవినీతి నిరోధక శాఖపై సమీక్ష చేశాడో సమాధానం చెప్పాలన్నారు. 

ఇది జనవరి కాదు దిశ నెల: స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా

అధికారం కోల్పోతే తన ఇంటికిపెట్టిన రూ.42కోట్లను జగన్‌ తిరిగి ఖజానాకు జమ చేస్తాడా అని వర్ల నిలదీశారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం నైతికతఉన్నా తనతప్పు ఒప్పుకొని తాడేపల్లి ఇంటి వివరాలు బహిర్గతం చేయాలన్నారు. జగన్‌ ఇల్లుకట్టుకున్నాడని చంకలు కొట్టుకున్న ఎమ్మెల్యేలు ఆర్కే, అంబటి, శ్రీకాంత్‌రెడ్డిలు ఇప్పుడేం చెబుతారన్నారు. 

దేశంలో ఎక్కడా జగన్‌కు సొంతిల్లు లేదని, హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌, బెంగుళూరులోని శ్వేతసౌధం, తాడేపల్లి నివాసం, ఇడుపులపాయ ఎస్టేట్‌ ఏవీకూడా జగన్‌పేరుతో లేవని... ఎన్నికల సంఘానికి ఆయనిచ్చిన అఫిడవిట్టే ఇందుకు నిదర్శనమన్నారు. అధికారుల్ని జైలుకి పంపడం జగన్‌కి కొత్తకాదు...జగన్‌ చెప్పినదానికి తలుపూతూ ఎక్కడపడితే అక్కడ ఎగిరెగిరి సంతకాలు పెడుతున్న అధికారులకు ముసళ్ల పండగ ముందుంటుందన్నారు. 

అధికారుల్ని జైలుకి పంపడం  జగన్‌కు కొత్తకాదని, కళ్లుమూసుకొని చెప్పిందల్లా చేస్తే వారి పనికూడా శ్రీలక్ష్మి, రాజగోపాల్‌, వీ.బీ.ఆచార్య, బ్రహ్మానందరెడ్డి వంటివారి పరిస్థితే వస్తుందని రామయ్య స్పష్టం చేశారు. బినామీ ఇంటికి రూ.42కోట్లు ఎలాకేటాయించారో సంబంధిత అధికారులు స్పష్టం చేయాలన్నారు.

సరస్వతీ పవర్‌పై ఉన్న శ్రధ్ద ఇతర కంపెనీలపై లేదేం..? తన కంపెనీలకు భూములు కేటాయించుకుంటూ రాష్ట్రంలోని ఇతర కంపెనీలు, ఫ్యాక్టరీల భూముల్ని వెనక్కుతీసుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. అలా వాటినెందుకు పక్కరాష్ట్రాలకు వెళ్లగొడుతున్నాడో జగన్‌ సమాధానం చెప్పాలని వర్ల డిమాండ్‌ చేశారు. 

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలో సరస్వతీ పవర్స్‌ కంపెనీకి రూ.5వేలకోట్ల విలువైన 1500ఎకరాల ఖనిజ భూములు కట్టబెట్టడం జరిగిందన్నారు. పవర్‌ ప్రాజెక్ట్‌, సిమెంట్‌ ఫ్యాక్టరీ పెడతామని ఉద్యోగాలిస్తామని రైతుల నుంచి భూములు తీసుకున్నా సదరు కంపెనీలు ఆపని చేయకపోవడంతో టీడీపీ ప్రభుత్వం ఆ భూముల్ని రైతులకు తిరిగిచ్చేసిందన్నారు. 

read more  భువనేశ్వరి గాజుల విరాళంపై వివాదం...మేమేం గాజులు తొడుక్కోలేదు: కంభంపాటి

తమ భూముల్ని తాము సాగుచేసుకుంటున్న రైతులపై వైసీపీ గూండాలు, బాంబులు, గొడ్డళ్లు, కత్తులతో, కారంపొట్లాలతో దాడికి పాల్పడ్డారన్నారు.  రైతులపై దాడికేసులో వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు కూడా ఉన్నాడన్నారు.  అధికారంలోకి వచ్చిన జగన్‌ 12-12-2019న జీవో.నెం.109ద్వారా టీడీపీ రైతులకు ఇచ్చిన భూముల్ని తిరిగి సరస్వతి పవర్‌కే కేటాయించాడన్నారు. 

1500ఎకరాల్లో యథేచ్ఛగా మైనింగ్‌ చేసుకోండంటూ భూములిచ్చిన రైతులనోట్లో మట్టికొట్టాడన్నారు. భూములతో పాటు ఆ కంపెనీకి కృష్ణానది నుంచి నీటిని తరలించాలంటూ, డిసెంబర్‌-3న జీవో.నెం-81ద్వారా ఆదేశాలు జారీచేశారన్నారు. సరస్వతీ పవర్‌ కంపెనీ మాదిరే రాష్ట్రవ్యాప్తంగా వివిధ కంపెనీలకు సంబంధించి 600ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, అవేవీ జగన్‌కు కనిపించలేదని రామయ్య పేర్కొన్నారు. 

తన కంపెనీలు, తన బంధుమిత్రుల కంపెనీలపై ఉన్న శ్రద్ధ ఇతర సంస్థలపై లేకపోవడం విచారకరమన్నారు. రాష్ట్ర ఖజానాకు ఏటావచ్చే రూ.5వేలకోట్ల ఆదాయాన్ని, జగన్‌ తన సొంతవారి ఖాతాలకు మళ్లించాడన్నారు. ఇదేమి న్యాయమో.. ఇలాంటి పనులు చేయడానికే తనకు అధికారమిచ్చారని జగన్‌ భావిస్తున్నాడా అని వర్ల నిగ్గదీశారు. 

29గ్రామాల రైతులు, 34వేలఎకరాలిస్తే వారిపై దుర్మార్గాలు, దుష్ట పన్నాగాలకు పాల్పడటం ముఖ్యమంత్రికే చెల్లిందన్నారు. జీ.ఎన్‌.రావు కమిటీ నివేదిక రాకముందే  దాని  గురించి బహిర్గతం చేసినందుకు జగన్‌ తక్షణమే తనపదవికి రాజీనామా చేయాలన్నారు. విశాఖ-విజయనగరం మధ్యన విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డికి ఉన్నభూముల్లోనే రాజధాని రాబోతుందని... బీ.సీ.జీ నివేదిక ఇలాగే ఇవ్వనుందని వర్ల పునరుద్ఘాటించారు.  రాజధాని మహిళల కన్నీళ్లతో జగన్‌ ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోయే రోజుదగ్గర్లోనే ఉందని వర్ల తేల్చిచెప్పారు.  
 
 

Follow Us:
Download App:
  • android
  • ios