గుంటూరు: గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా జరిగిన వేడుకల్లో వైసిపిలోని రెండు వర్గాల మద్య వివాదం చెలరేగింది. దాచేపల్లి మండలం నడికుడిలో ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో రెండు బిసి సామాజిక వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. కత్తులతో దాడులకు తెగబడటంతో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో  ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను గురజాల, పిడుగురాళ్ల హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

వీడియో

"