ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆనందం .. జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం

ఏపీ సీఎం జగన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. వీరి కోసం ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్‌ ఏర్పాటుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసిి మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, ఉద్యోగుల నిర్వహణకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

the-anointing-of-milk-to-jagan-portrait

అమరావతి: సచివాలయంలో సీఎం జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు ఏపీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు. ఆంధ్రప్రదేశ్ గవర్మెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామి రెడ్డి  అధ్యర్యంలో ఉద్యోగులు జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని  సీఎం తీసుకున్న నిర్ణయానికి   కృతజ్ఞతలు  తెలిపారు ఉద్యోగులు  .

బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ అధికారుతో జరిపిన  సమిక్షా సమావేశంలో  ఈ నిర్ణయం తీసుకున్నారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో సగం వాటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జీఏడీ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు  సీఎం అదేశాలు
జారిచేశారు.  అలాగే కార్పొరేషన్ అనుబంధంగా జిల్లా స్థాయిలో కూడా శాఖలు ఉండాలని  అధికారులకు జగన్ సూచించారు.   లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతోనే విభాగం పని ఉండాలని  తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి నేతృత్వంలో జిల్లా శాఖల పనిచేస్తాయని వాటికి  కలెక్టర్‌ ఎక్స్‌ అఫీషియో కన్వీనర్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.

నియామకాలు పోర్టల్‌ ద్వారా జరపాలన్నారు.  అందరికీ ఒకే రకమైన నియమ నిబంధనలుంటాయని చెప్పారు. వారి జీతాలను  ఆన్‌లైన్‌ పద్ధతుల్లో  జరపాలని సూచించారు.  
జీతాల విషయంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు  ఎదురుకాకూడదన్నారు. ఈ నెల 16న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఔట్‌ సోర్సింగ్‌పై స్పష్టమైన విధానంపై నిర్ణయం తీసుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్‌.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios