అమరావతి: గతకొంతకాలంగా వైఎస్సార్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బుద్దా వెంకన్న వరుస ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి విజయసాయి రెడ్డిన శకుని మామా అని... జగన్ ను తుగ్లక్, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మహామేత అని సంబోధిస్తూ సంచలన ట్వీట్స్ చేశారు. 

'' రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలియకుండానే రాష్ట్ర ప్రజలకు నవరత్నాయిల్ రాసారా శకుని మామా?అత్యధిక పార్లమెంట్ సీట్లు గెలిపిస్తే మోదీ మెడలు వంచుతాం, కేంద్రాన్ని కడిగేసి రాష్ట్ర ఖజానా నింపుతాం అన్నారుగా  నువ్వు,మీ తుగ్లక్  గుర్తుందా?''  

''తీరా మీకు 22 ఎంపీలని ఇస్తే రాష్ట్రం కోసం పోరాడాల్సింది మానేసి  మీ కేసుల మాఫీ కోసం వంగి వంగి దండాలు పెడుతూ ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని కేంద్రానికి తాకట్టు పెట్టేసారు కదా శకుని మామా ! పైగా రాష్ట్ర ఆర్ధిక స్థితి అప్పులు అంటూ మంగళవారం కబుర్లోకటి !! ''

Read More  బీజేపీలో చేరిన మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి: జగన్ మెుండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు ...

''మడమ తిప్పామ్,  మాట మార్చామ్ అని ఒప్పుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబితే, మీ మహమేత హయాంలో చేసిన అప్పులు, చంద్రబాబు గారి చేసిన అప్పులు సృష్టించిన సంపద పై నీతో చర్చకు నేను సిద్ధం. నువ్వు సిద్ధమా శకుని మామా ?'' అంటూ వరుస వెంకన్న వరుస ట్వీట్లు చేశారు. 

నిన్న ఆదివారం కూడా ఇదేవిధంగా వరుస ట్వీట్లతో వెంకన్న వైఎస్సార్‌సిపి ప్రభుత్వం, విజయసాయి రెడ్డిపై విమర్శలు గుప్పించారు. '' అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయ్యింది. ఒక్క ఎకరం ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని నిరూపించలేకపోయావ్. అయినా సిగ్గు లేని మాటలు మాట్లాడతావ్. అమరావతి నిర్మాణం ఇష్టం లేకపోతే దైర్యంగా ప్రకటించండి. అప్పుడు తెలుస్తుంది అమరావతి బంగారు బాతో లేక మీ ప్రభుత్వానికి పాడె కట్టబోయే మొదటి అంశమో!!''

Read More నా ఎదుగుదల ఓర్వలేకే: ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటానన్న దేవినేని...
 
''మంగళవారం కబుర్లు ఎందుకు శకుని@VSReddy_MP మామా? క్విడ్ ప్రో కో,ఇన్సైడర్ ట్రేడింగ్,మనీ లాండరింగ్,సూట్ కేస్ కంపెనీలకు పేటెంట్ రైట్స్ మీ తుగ్లక్ 
@ysjagan దగ్గరే ఉన్నాయి కదా శకుని మామా!! నువ్వు ఇంకా ప్రతిపక్షంలొనే ఉన్నట్టు మాట్లాడితే ప్రజలు నీ మొహం మీద ఉమ్మటం ఖాయం.'' అంటూ కాస్త ఘాటుగానే విమర్శలకు దిగారు.