అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. సీఎం జగన్ కు దెయ్యం పట్టిందని ఆరోపించారు. జగన్ కు పట్టిన దెయ్యాన్ని తెలుగుదేశం ప్రభుత్వమే వదిలిస్తుందని స్పష్టం చేశారు. 

జగన్ కు ప్రజల్లో తిరిగే దమ్ము ధైర్యం లేదంటూ మండిపడ్డారు. జగన్ మానసిక స్థితిపై ఆందోళనగా ఉందన్నారు. అన్ని రంగాల్లో జగన్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని అనురాధ నిప్పులు చెరిగారు. భ్రష్టుపట్టిపోయిన విధానాలతో వైసీపీ ప్రభుత్వం పయనిస్తోందంటూ విరుచుకుపడ్డారు. అన్ని రంగాల్లో జగన్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. 

రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ప్రజలు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి వినిపించడం లేదన్నారు. ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వమంటూ విరుచుకుపడ్డారు. మూగ పరిపాలనను భవరించలేకపోతున్నట్లు తిట్టిపోశారు. గోదావరి నదిలో బోటు ప్రమాదంలో చనిపోయిన బాధితుల ఆర్తనాదాలు వినలేని దుస్థితిలో జగన్ ఉన్నారని ఆరోపించారు. 

మంత్రి అవంతి అనుమతితోనే బోటు నడిపారు:
ఇకపోతే తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం మంత్రి అవంతి శ్రీనివాస్ కు తెలిసేలా జరిగిందని అనురాధ ఆరోపించారు. జగన్ కు ఫోన్ చేసే బోటును నడిపారని చెప్పుకొచ్చారు. 

బోటు ప్రమాదంలో సుమారు 30 మందికి పైగా చనిపోయినా ప్రభుత్వానికి చీమైనా కుట్టినట్లు లేకుండా పోయిందన్నారు. బోటు ప్రమాదంలో చనిపోయిన బాధితుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినబడటం లేదని ధ్వజమెత్తారు. ఇలాంటి మూగ ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. 

ఇలాంటి గుడ్డి ప్రభుత్వం ఉండటం ఏపీ ప్రజల దౌర్భాగ్యమని విమర్శించారు సీఎం జగన్. వైయస్ జగన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చెప్పుకొచ్చారు. వాటన్నింటిని కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ చేస్తోందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం డైవర్షన్ ప్రభుత్వంగా మారిపోయిందని ధ్వజమెత్తారు అనురాధ. 

గ్రామసచివాలయం పేర్లు లీక్ పై విచారణ ఏది:
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రామ సచివాలయం పరీక్షల్లో క్వశ్చన్ పేపర్ లీకైనట్లు అనురాధా ఆరోపించారు. క్వశ్చన్ పేపర్ లీకైన వ్యవహారంపై ప్రభుత్వం అసలు స్పందించలేదని విమర్శించారు.  

సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకే మెుదటి ర్యాంకులు ఎలా వస్తాయని విమర్శించారు. ఒకే ఇంటిలో ముగ్గురుకి ఎలా ఉద్యోగాలు వస్తాయో చెప్పాలని అనురాధా నిలదీశారు. రివర్స్ టెండరింగ్, సచివాలయం ఉద్యోగాలు ఓ కుంభకోణాలు అంటూ చెప్పుకొచ్చారు.  

గోదావరి బోటులో ప్రయాణికులు చనిపోతే వారిని ఆదుకునే మనస్సు కూడా జగన్ కు లేదన్నారు. హెలికాప్టర్లలో ప్రయాణిస్తూ తప్పించుకు తిరుగుతారని కానీ నేలమీద మాత్రం పయమనించరని విమర్శించారు.  

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. నవరత్నాలను గాలికొదిలేశారని వాటన్నింటిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ఇంటికి నోటీసులు ఇస్తారంటూ విరుచుకుపడ్డారు. 

ఆ ఇళ్లు చంద్రబాబు నాయుడుది కాదని అలాంటప్పుడు చంద్రబాబుకు నోటీసులు ఎలా ఇస్తారని నిలదీశారు. లింగమనేని రమేష్ తో ప్రభుత్వం తేల్చుకోవాలని కానీ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి ఎప్పుడు ఇంటి నుంచి పంపించేద్దామా అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

 పొద్దున్నే లేస్తే ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఎవరికి రూ.3లక్షలు జీతం ఇవ్వాలి. లేకపోతే చంద్రబాబు ఇంటిని ఎలా కూల్చాలి. ఇవే జగన్ ప్రభుత్వం ఆలోచనలు అంటూ విమర్శించారు. ఇవి తప్ప ఇంకేమీ ఇంకేమీ లేదన్నారు. జగన్ ప్రభుత్వానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 

ప్రభుత్వాన్ని నిలదీస్తే అంబటి రాంబాబును వదులుతారని విమర్శించారు. సచివాలయ ఉద్యోగాల్లో అవకతవకలపై అంబటి రాంబాబు రంకెలు వేస్తాడని విమర్శించారు. ఎందుకు రంకెలు వేస్తాడో ఆయనకే అర్థం కాదన్నారు. 

రంకెలు వేసినంత మాత్రాన నిజాలు అబద్దాలు అయిపోతాయా అంటూ నిలదీశారు. రంకెలు ఆపేసి వాస్తవంలోకి రండి అంటూ అంబటికి చురకలంటించారు. ఉడా చైర్మన్ మల్లాది విష్ణు ఎంత మింగారో లెక్కలు వేయండి అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు అనురాధా.  

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబు ఇంటికి మళ్లీ నోటీసులు.. కూల్చివేయడం ఖాయమా..?