Asianet News TeluguAsianet News Telugu

జగన్ నీతివంతుడా..?మీరెలా సర్టిఫికెట్ ఇస్తారు: అధికారులపై చంద్రబాబు ఆగ్రహం


వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిందని చంద్రబాబు ఆరోపించారు. పీపీఏలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఎక్స్ పెర్ట్  కమిటీని నియమించిందని అవసరం లేకపోయినా ప్రధాని నరేంద్రమోదీకి సైతం ఫిర్యాదు చేశారని ఆరోపించారు. 

tdp president chandrababu naidu slams cm ys jagan
Author
Guntur, First Published Sep 27, 2019, 1:15 PM IST

 

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. మహాత్మగాంధీచెప్పినట్లు నిజం నిప్పులాంటిది అని చెప్పుకొచ్చారు. వాస్తవం శాశ్వతంగా నిలిచిపోతుందని కానీ మిగిలినవి అన్నీ తాత్కాలికంగా నిలిచిపోతాయన్నారు.  

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిందని చంద్రబాబు ఆరోపించారు. పీపీఏలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఎక్స్ పెర్ట్  కమిటీని నియమించిందని అవసరం లేకపోయినా ప్రధాని నరేంద్రమోదీకి సైతం ఫిర్యాదు చేశారని ఆరోపించారు. 

పీపీఏలో ఎలాంటి అవినీతి జరగలేదని కేంద్రం చెప్పడంతో వైసీపీ ప్రభుత్వం నవ్వులపాలయ్యిందని స్పష్టం చేశారు. వాస్తవం ఏంటో అనేది కేంద్రం స్పష్టం చేసిందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. 

క్రిమినల్ యాక్టివిటీ, నీతి నిజాయితీల గురించి మాట్లాడేది మీరా అంటూ జగన్ పై విరుచుకుపడ్డారు. పీపీఏలపై జగన్ ప్రభుత్వం తప్పుడు వ్యవహారంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తన హయాంలో విద్యుత్ రంగంలో ప్రభుత్వానికి 149 అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. 

ఇకనైనా తమపై తప్పుడు ఆరోపణలు మాని ప్రజలకు మంచి పాలన అందించాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. అధికారులు జగన్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. 

జగన్ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని, నీతివంతుడు అని అధికారులు సర్టిఫికెట్ ఇవ్వడంపై మండిపడ్డారు. జగన్ అనేక కేసులు ఎదుర్కొంటున్న విషయం అధికారులకు తెలియదా అని నిలదీశారు.  

సీబీఐ 12 చార్జిషీట్లో నిందితుడు, 43వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన వ్యక్తి, ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరయ్యే వ్యక్తి  జగన్ అంటూ మండిపడ్డారు. అలాంటి వ్యక్తి నీతి నిజాయితీ పరుడంటూ నివేదికలు ఇస్తారా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇలాంటి వ్యాఖ్యలు చేసే అధికారం ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు. పీపీఏలపై అధికారులు ఇచ్చిన నివేదికపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే అత్యుత్సాహం చూపించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

రాష్ట్రం కోసం, ప్రభుత్వం కోసం అహర్నిశలు శ్రమించిన తమపై బురదజల్లుతారా అంటూ నిలదీశారు. గతంలో కూడా ఇలాగే కొంతమంది అధికారులు తమపై తప్పుడు ఆరోపణలు చేశారని వారికి తగిన శాస్తి జరిగిందన్నారు. ఇప్పటికీ కొంతమంది సీబీఐ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారంటూ చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. 

ఈ వార్తలు కూడా చదవండి

పీపీఏలపై కేంద్రం సీరియస్: జగన్ కు కేంద్రమంత్రి ఆర్కే సింగ్ లేఖ.. 

రివర్స్ టెండరింగ్, పీపీఏలపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు పిపిఎల సమీక్షపై విద్యుత్ సంస్థలకు హైకోర్టు...
పిపిఎల సమీక్షపై విద్యుత్ సంస్థలకు హైకోర్టు షాక్ పీపీఏలపై తప్పుడు ప్రచారం, మేం చెప్పినా వినడం లేదు: ...

 
 

Follow Us:
Download App:
  • android
  • ios