ముగిసిన టిడిపి పొలిట్‌బ్యూరో సమావేశం... చర్చించిన అంశాలివే

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. ఈ భేటీలో చర్చించిన అంశాలను మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాలువ శ్రీనివాస్ లు మీడియాకు వివరించారు.  

TDP politburo meet today

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు  ప్రజా, అభివృద్ది వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ తెలుగు రాష్ట్రాల ప్రతిష్టను దిగజారుస్తున్నట్లు టిడిపి పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. వీటిపై పోరాడేందుకు సిద్దంగా వుండాలంటూ నాయకులకు టిడిపి అధినాయకత్వం సూచించింది. ప్రజల పక్షాన పోరాడుతూనే ప్రభుత్వ చర్యలను ఎండగట్టాలని టిడిపి పొలిట్ బ్యూరో నిర్ణయించింది. 

గురువారం ఉదయం నుండి తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరుగుతున్న విషయం తెలసిందే. కొద్దిసేపటిక్రితమే ఈ సమావేశం ముగిసింది. ఈ కార్యక్రమంలో చర్చించిన వివరాలను కొందరు నాయకులు మీడియాకు వివరించారు. 

ముందుగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ... సమావేశం ప్రారంభించేముందు తమ పార్టీ దివంగత నాయకుడు, మాజీ స్పీకర్ కొడెల శివప్రసాద్,  పడవ ప్రమాద మృతులకు నివాళులు అర్పించినట్లు తెలిపారు. అనంతరం 

యువత, మహిళలకు ఎక్కువ అవకాశం ఇచ్చేలా పార్టీ కమిటీలను రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో రోడ్డు నిర్మాణం నుండి భారీ ప్రాజెక్టయిన పోలవరం వరకు అన్ని పనులూ నిలిచిపోయాయని అన్నారు. నాలుగు నెలల్లోనే రాష్ట్ర ఆదాయం ఏకంగా 17 శాతం తగ్గిందన్నారు. రాష్ట్ర భవిష్యత్ పై పొలిటీబ్యూరో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు. 

రాష్ట్రంపై పెట్టుబడి దారుల విశ్వసనీయత తగ్గిపోయిందన్నారు. ప్రతిష్టాత్మక కియా కంపెనీ ప్రారంభానికే సీఎం రాకపోతే ఇంకా ఎవరు పెట్టుబడులు పెడతారని మాజీ మంత్రి విమర్శించారు. 

2007లో మీడియాపై ఆంక్షలు విధిస్తూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ తీసుకొచ్చిన జీవోనే జగన్ ఇప్పుడు తీసుకు వచ్చారని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తమ నాయకులు అయ్యన్నపాత్రుడు, వర్ల రామయ్య వంటి వారిపై కేసులు పెడుతున్నారని సోమిరెడ్డి అన్నారు.

నీటి పారుదల విషయంలో పొరుగు రాష్ట్రాలతో కలిసి ప్రాజెక్ట్ లు సరి కాదని...ఎవరి ప్రాజెక్ట్ లు వాళ్లే కట్టుకోవాలని పొలిట్ బ్యూరో అభిప్రాయ పడిందన్నారు. పులివెందుల, పుంగనూరు నియోజకవర్గాలలో చేసిన పంచాయతీ పనుల బిల్లులే చెల్లించాలని ఆదేశాలు ఇవ్వడం న్యాయం కాదన్నారు. బీజేపీపై పోలిట్ బ్యూరో లో ఎలాంటి చర్చ జరగలేదని సోమిరెడ్డి వెల్లడించారు.

పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాద్...

తెలంగాణ టిడిపి నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ఆర్టీసి కార్మికుల ఆత్మహత్యలపై పొలిట్ బ్యూరో ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. ఇద్దరు సీఎంల పోకడలు ఒకేలా ఉన్నాయని...మీడియా అంటే ఇద్దరు సీఎంలు ద్వేషం పెంచుకున్నారన్నారు.

 మీడియా వాచ్ పై ఆనాడు తెచ్చిన జీవోను వెఎస్సార్ వెనక్కి తీసుకున్నారని...ఇప్పుడు మళ్లీ వీరు దాన్ని అమలుచేస్తున్నారని అన్నాడు. మద్యం ఆదాయం మీదే ప్రభుత్వాన్ని నడపాలని కేసీఆర్ చూస్తున్నారని రావుల ఎద్దేవా చేశారు.

మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ... బావ ప్రకటన స్వేచ్ఛను అణిచి వేసేలా సీఎం నిర్ణయాలు ఉన్నాయన్నారు.  మేధావులు మౌనం వీడాల్సిన సమయం వచ్చిందని...తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు అనే ఆలోచన ప్రమాద కరమని కాలువ అభిప్రాయపడ్డారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios