ప్రతిపక్ష నాయకుల ప్రాణాలు తీసిన ఆ కత్తినే జగన్ ఇప్పుడు...: అనగాని సత్యప్రసాద్
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ప్రభుత్వ పాలన గురించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులను తమ ఇష్టారీతిగా వాడుకోవడాన్ని టిడిపి రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తప్పుబట్టాడు. ముఖ్యంగా ప్రజా రక్షణ కోసం ఉపయోగపడే పోలీసులను ప్రజలను హింసించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్ ప్రభుత్వం ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి ఓ బహిరంగ లేఖ రాశారు.
గౌ|| రాష్ట్ర ముఖ్యమంత్రి...
జగన్మోహన్ రెడ్డి గారికి
విషయం : వి.ఆర్‌లో ఉన్న పోలీసులకు పోస్టింగ్ మరియు వేతనాల చెల్లింపులపై ఇచ్చిన జీవో కారణంగా ఎదురయ్యే సమస్యల గురించి..
ఎండనక వాననక, కుటుంబాలను కూడా వదిలిప్టిె శాంతి భద్రతలు పరిరక్షనే ప్రథమ కర్తవ్యంగా భావించే పోలీసులను మీరు అధికారంలోకి వచ్చాక అష్టకష్టాలు పెడుతున్నారు. పోస్టింగులు కూడా ఇవ్వకుండా నెలల తరబడి నిరీక్షణలో ఉంచుతున్నారు. వేతనాలు కూడా చెల్లించేది లేదని జీవో తీసుకొచ్చి వేధనకు గురి చేస్తున్నారు. పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలను ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాను...
ఎనిమిది నెలల క్రితం వరకు పోలీసు యంత్రాంగం ప్రజా పరిరక్షణకే పరిమితమై పనిచేసేది. కానీ.. మీ పుణ్యమా అని.. పోలీసుల విధుల్లో, వారి బాధ్యతల్లో కూడా రాజకీయ జోక్యం పెరిగిపోయింది. ప్రజల కోసం పాటు పడితే వేటు పడుతుందేమో అనేంతలా భయపడే పరిస్థితి కల్పించారు. ఇదంతా మీ ఫ్యాక్షన్ రాజకీయాల ఫలితంగానే అని ప్రతి పోలీసు అధికారికీ ఆవేదన చెందుతున్నారు. నిన్ని వరకు ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల ప్రాణాల తీసిన మీ ఫ్యాక్షన్ కత్తిని.. నేడు ప్రభుత్వ ఉద్యోగులపైనా ప్రయోగిస్తున్నారనడానికి తాజా సంఘటనలే నిదర్శనం. మీ ఏకపక్ష నిర్ణయాలు, నియంతృత్వ పోకడలతో ప్రజలను హింసించేందుకు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారు. మొన్ని వరకు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలతో జనంతో మమేకమై పోలీసుల్ని చూసి జనం భయపడే పరిస్థితి నేడు కల్పించారు. హేయభావం సృష్టించారు. దీనికితోడు.. పోస్టులు ఖాళీగా ఉన్నా.. పోస్టింగులు ఇవ్వకుండా వి.ఆర్‌లో ఉంచి వందలాది మంది పోలీసుల్ని వేధిస్తున్నారు.
దాదాపు 58 మంది డీఎస్పీలు, 100 మంది వరకూ ఇన్‌స్పెక్టర్లు, 10 మంది అదనపు ఎస్పీలను నెలల తరబడి నిరీక్షణలో ఉంచడం ఎంతవరకు సమంజసం.?పైగా 3 నెలలకు మించి వెయిిింగ్‌లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం చెల్లించమంటూ ఉత్తర్వులు ఇవ్వడం, 3 నెలల కన్నా ఒక్కరోజు ఎక్కువ వెయిిింగ్‌లో ఉన్నా అసాధారణ సెలవుగా పరిగణిస్తామని పేర్కొనడం ఎంతవరకు సబబు..? ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా వెయిిింగ్‌లో ఉంటే చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా.. ప్రభుత్వమే వారిని వెయిిింగ్‌లో ఉంచి, అవసరానికి వారి సేవలు వాడుకుని, ఇప్పుడు వెయిిింగ్‌లో ఉన్నారనే సాకుతో వాళ్లపైనే చర్యలు చేపట్టడం వేధించడం కాక మరిేం.? ఏదైనా తప్పు చేసి సస్పెండ్ అయిన వారికి సైతం సగం జీతం వస్తుంది. కానీ.. మీరు ఉద్దేశ్య పూర్వకంగా పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచి ఇప్పుడు వేతనాలు కూడా ఇవ్వమంటే ఎలా.? ఎప్పికైనా వేతనం వస్తుందనే నమ్మకంతో ఎంతో మంది ఉద్యోగులు.. అప్పులు చేసి మరీ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు.. అలాిం వారికి మీ నిర్ణయం శరాఘాతం కాదా.? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఉద్యోగులు బలవ్వాలా.? ఉద్యోగుల వయసు, అనుభవానికి కూడా గౌరవం ఇవ్వరా.?శాంతిభద్రతలను పరిరక్షించే పోలీసులనే భయభ్రాంతులకు గురిచేయడం ఉన్మాద చర్య కాదా.?
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి.. ఉద్యోగులు, వ్యక్తుల మనోభావాలను గౌరవించేలా ఉండాలి. ప్రజల శ్రేయస్సుకు తపించాలి. కానీ.. మీరు అధికారంలోకి వచ్చినప్పి నుండి.. రాష్ట్రంలో వేధింపులు, కక్ష సాధింపులే ప్రధాన అజెండాగా పనిచేస్తున్నారు. మీ నియంత విధానాలను కాదని ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం విషయంలో మీరు వ్యవహరించిన విధానాన్ని ప్రజలంతా చూశారు. ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల అనుభవం కలిగిన ఐపీఎస్ అధికారిని మరింత కించపరిచేలా దేశద్రోహం చేశారంటూ.. ఏకంగా సస్పెండ్ చేశారు. మీరు అధికారంలోకి వచ్చింది ఇందుకేనా.? మీ అధికారం ప్రజల్ని ఉద్యోగుల్ని అవస్థలకు గురి చేయడానికేనా.?
(అనగాని సత్యప్రసాద్) రేపల్లె శాసన సభ్యులు