బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీకి మూడు రాజధానులు ఉంటే తప్పేంటన్న జీవీఎల్.. ఓ పనికిమాలిన ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.

శుక్రవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన .. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో జీవీఎల్ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని రామయ్య నిలదీశారు. నరసింహారావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడటం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు.

Also Read:టిడీపీవాళ్లను కాల్చిపడేసి...పార్టీని ఏపి నుండి పంపించేయాలి...: వర్ల రామయ్య

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని జీవీఎల్ ఏకాంతంగా ఎందుకు కలిశారని.. అది కూడా రాష్ట్ర బీజేపీకి తెలియకుండా అంటూ నిలదీశారు. దీనిపై ఆయన సమాధానం చెప్పి తీరాలని రామయ్య డిమాండ్ చేశారు.

అలాగే ఢిల్లీలోని లోడీ హౌస్‌లో వైసీసీ కీలక నేతలను ఎందుకు కలిశారని వర్ల నిలదీశారు. మూడు రాజధానులపై కారుకూతలు కూయడం మానుకోవాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

Also Read:వీఆర్ వివాదం... వర్ల రామయ్యపై పోలీస్ అధికారుల సంఘం ఫైర్

నరసింహారావుకు దమ్ముంటే రాజధానిలో పర్యటించాలని సవాల్ విసిరారు. తినేది బీజేపీ కూడు.. పాడేది జగన్ పాట అంటూ రామయ్య ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జీవీఎల్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ను కంట్రోల చేయాలని వర్ల సూచించారు.