ముఖ్యమంత్రి జగన్ పై టిడిపి అదికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

గుంటూరు: అవినీతి బురదలో కూరుకుపోయినా సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి సహా అనేక మంది వైసీపీ నాయకులు వారి పై ఉన్న బురదను సాక్షి దొంగ పత్రికను చేతిలో పెట్టుకొని ఇతరులపై జల్లే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నతనంలో అలీబాబా అర డజన్ కథ విన్నాం..అలాగే ఇప్పుడు జగన్ బాబా జగమేరిగినా దోంగల కథ మనం ఇప్పుడు వింటున్నామని ఎద్దేవా చేశారు. లోకేష్ మొన్న ఆస్తుల ప్రకటన చేస్తే దేవాన్ష్ ఆస్తులపై దొంగ పత్రిక సాక్షి తప్పుడు రాతలు రాసిందని విమర్శించారు. 

దేవాన్ష్ కు తాత అయిన బాలకృష్ణ, వసుంధర గిఫ్ట్ గా ఇచ్చారని ఆస్తుల ప్రకటనలో చెప్పడం జరిగిందన్నారు. వాటిని సాక్షి పత్రిక బాలకృష్ణ ఎన్నికల అఫిడవిట్ పేర్కొనలేదని రాయడం జరిగిందన్నారు. అగస్టు 2, 2018 ఇచ్చిన షేర్స్ అఫిడవిట్ ఎలా పొందుపరుస్తారని పట్టాభిరామ్ ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఆస్తులపై ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు వచ్చే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు.

''మొదటి కథలో హెటోరో ఫార్మ, అరవిందో ఫార్మా వీళ్లకు ఎసీజే పేరుతో జండర్ల, శ్యామవరం అనే ప్రాంతంలో 150ఎకరాలు అడ్డుగోలుగా క్విట్ ప్రో కో ద్వారా వేల కోట్లు దోచుకున్నారు. 
రెండోవ కథలో జగతి పబ్లికేషన్ పై సీపీ-9, 2012 ప్రకారం సెక్షన్ 420, 409,468 అనేక కేసులు పెట్టారు. మూడోవ కథలో సీసీ-10, 2012లో రాంకీ గ్రూప్ కు భూములు కట్టబెట్టి క్విట్ ప్రోకో ద్వారా వేల కోట్లు దోచుకున్నారు'' అని అన్నారు.

read more డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిపై అసభ్య కామెంట్స్... ఆకతాయి అరెస్ట్

''నాలుగోవ కథలో నిమ్మగడ్డ ప్రసాద్ వాన్ పిక్ 28వేల ఎకరాలు కట్టబెట్టినందు రూ.854కోట్లు దొంగ పత్రికకు పెట్టుబడి పెట్టారు. ఐదోవ కథలో దాల్మియా సిమెంట్ భూములు కట్టబెట్టినందకు రూ.205 కోట్లు తిరిగి జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులు జరిగాయి. ఆరోవ కథలో ఇండియా సిమెంట్ కంపెనీ భూమి కేటాయింపు, నీటి సౌకర్యాలు కల్పించినందకు రూ.140కోట్లు జగన్మోహన్ రెడ్డి కంపెనీలోకి చేరాయి. ఏడోవ కథలో భారతి సిమెంట్ దీనికి 2,37.532 ఎకరాలు కడప జిల్లాలో కట్టబెట్టారు'' అని అన్నారు.

''ఎనిమిదో కథలో పెన్నా సిమెంట్ కు సంబంధించి 231 ఎకరాలు అనంతపురం, 304 హెక్టారు కర్నూలు, 821 ఎకరాలు రంగారెడ్డి జిల్లాలో కట్టబెట్టినందకు దాదాపు రూ.200 కోట్లు జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో చేరాయి. తొమ్మిది, పదోవ కథలో జాతీయకోర్టు ఫిర్యాదు చేయడానికి ప్రధాన కారణం హిందు టెక్ జోన్, లేపాక్షి నాలెడ్జి హాబ్ పేరిట 8,844 ఎకరాలను అనంతపురంలో భూములు తసుకున్నందకు జగన్ పై కేసు నమోదు చేయడం జరిగింది. పదకొండవ కథలో హౌసింగ్ కు సంబంధించి హిందు గ్రూప్ అనేక అక్రమాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పై కేసులు పెట్టారు'' అని పట్టాభిరామ్ ఆరోపించారు.

ఈ 11 చార్జీషీట్ పై బహిరంగ చర్చకు వైసీపీ నాయకులు రావాలని సవాల్ విసిరారు. జనవరి 17, 2020 కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన గేజిట్ ను చూసి వైసీప గుండెల్లో రైల్లు పరుగెతున్నాయని అన్నారు. జీవో నెం:51 ప్రకారం ఈఎస్ఐ మందుల కోనుగోలు విషయం రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పడం జరిగిందన్నారు. 

read more జగన్ ను వారు ఖైమా చేయడం ఖాయం... పివిపి ట్వీట్ వెనుక...: వర్ల రామయ్య

ఈఎస్ఐ కోనుగోలు విషయంలో కూడా అచ్చెన్నాయుడి ప్రమేయంలేదని చెప్పారని అన్నారు. ఈఎస్ఐ పూర్తిగా కేంద్రం ప్రభుత్వంలో అధీనంలో ఉన్న వ్యవస్థ మరి మీరు ఏరకంగా అచ్చెన్నాయుడిపై అరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ లోపల, బయట బీసీలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వలనే అచ్చెన్నాయుడిపై అక్రమ అరోపణలు చేస్తున్నారు. ముందు ధైర్యం ఉంటే సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరపాలని అన్నారు. 

ముఖ్యమంత్రి జగన్ సొంత చెల్లే సిట్ విచారణను నమ్మడం లేదని చెబుతుంటే మీ ఎలా వేస్తున్నారో సమాధానం చెప్పాలని అన్నారు. ఏ సీట్ కమిటీలు వేసిన తాము భయపడాల్సిన అవసరం లేదని పట్టాభిరామ్ పేర్కొన్నారు.