Asianet News TeluguAsianet News Telugu

అన్నదాతలపై మర్డర్ కేసులా...?: జగన్ పై చంద్రబాబు ఫైర్

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నిరసన తెలియజేస్తూ అరెస్టయిన రైతులను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు.  

tdp chief chandrababu naidu visits amaravati farmers in jail
Author
Guntur, First Published Dec 30, 2019, 3:07 PM IST

గుంటూరు జైలులో ఉన్న ఆరుగురు రైతులను మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. రాజధానిని అమరావతి నుండి మార్చకూడదని డిమాండ్ చేస్తూ 12 రోజులుగా అమరావతి పరిసర ప్రాంతాల రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఆందోళనకు దిగిన పలువరు రైతులపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ కేసుల్లో భాగంగానే పోలీసులు  ఆందోళన చేస్తున్న రైతులపై అరెస్ట్ చేశారు. 

వీరిని గుంటూరు జైలులో పెట్టగా తాజాగా  చంద్రబాబు వారిని కలుసుకున్నారు. జైలు బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైతులను అరెస్టు చేయడం  సిగ్గుచేటన్నారు. రైతులపై 307సెక్షన్ కింద కేసులు పెడతారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

read more  జైలులో రైతులను పరామర్శించనున్న చంద్రబాబు

రాజధాని రైతులు ఏ మరణాయధాలతో దాడులు చేశారో చెప్పాలని నిలదీశారు. అర్ధరాత్రి దొంగలను తీసుకోచ్చినట్లు అన్నదాతలను అరెస్టులు చేస్తారా అంటూ పోలీసులపై మండిపడ్డారు. రాజధాని గ్రామాల ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడానికి ప్రభుత్వమే ఇందంతా చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు.

రాజధాని రైతుల అరెస్టులు, ప్రజల ఉద్యమాన్ని అణచివేడయం ఇదంతా సిఎం జగన్ కనుసన్నల్లో జరుగుతోందన్నారు. రైతులపై ఎందుకు అటెంటు మర్డర్ కేసులు పెట్టారో డిజిపి చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

రైతులు ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని... రాజధాని మారిస్తే తమ బతుకులు ఏమవుతాయోనని రైతులు భయపడుతున్నారని అన్నారు. అమరావతి రాజధాని మార్చమని ఎవరు అడిగారని...ఇప్పటికయినా సిఎం జగన్ అమరావతి రాజధాని కొనసాగుతుందని చెప్పాలని చంద్రబాబు సూచించారు.

read more  అమరావతిలో బాబు ఇన్‌సైడర్ ట్రేడింగ్: బొత్స సంచలనం

గుంటూరు జిల్లా జైలుకు చంద్రబాబుతో పాటు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు,  మాజీ మంత్రులు పుల్లారావు, ఆనంద బాబు, కొల్లు రవీంద్ర ఎమ్మెల్సీ అశోక్ బాబు, శ్రావణ కుమార్ లు వచ్చారు. వెంటనే అరెస్టు చేసినఆరుగురు రాజధాని రైతులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios