Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం పెట్టటడం మంచిదే: సోము వీర్రాజు

ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి ప్రతిపక్ష పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. గతకొంత కాలంగా టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అలాగే   ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం పెట్టటడం మంచిదే..  పోటీ పరీక్షలకు ఇంగ్లీషు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. 

somu virraju comments on andhra pradesh govt schools
Author
Hyderabad, First Published Nov 11, 2019, 6:35 PM IST

ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి ప్రతిపక్ష పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. గతకొంత కాలంగా టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అలాగే   ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం పెట్టటడం మంచిదే. పోటీ పరీక్షలకు ఇంగ్లీషు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. 

సోము వీర్రాజు మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ని కలిసాను. అమౌంట్ 20 లక్షలు కావడంతో సీఎంను స్వయంగా కలిశాను. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో కమిటీ వేశారు. సలహాల ఇవ్వమని కమిటీ సభ్యలు ప్రజలను అడిగారు. నిపుణుల కమిటీకి నేను కొన్ని సలహాలు ఇచ్చాను.

కమిటీకి చూసించిన సలహాలనే సీఎం కూడా వివరించాను. రాజధానిపై చంద్రబాబు హైప్ క్రియేట్ చేశారు. 7 వేల కోట్లు ఖర్చు చేసామని చంద్రబాబు అంటున్నారు. 7 వేల కోట్లు పెట్టి ఏమి కట్టారో విచారణ జరపాలి.  విడిపోయిన రాష్ట్రం రాజధాని కట్టుకోవడం సహజం. అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలి. 42 శాతం మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ప్రైవేట్ స్కూల్ ల్లో 58 శాతం ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు.

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం పెట్టటడం మంచిదే. పోటీ పరీక్షలకు ఇంగ్లీషు ఎంతో ఉపయోగపడుతుంది. తెలుగు ఎంత ముఖ్యమో ఇంగ్లీష్ కూడా అంతే ముఖ్యమే. మా పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు.  ఇంగ్లీష్ తో పాటు తెలుగు కూడా ముఖ్యమే. టీడీపీ మంత్రి నారాయణ కూడా ఇంగ్లీష్ చదువుకోవడం మంచిదని చెప్పారు.. విద్య వైద్యంలో అనాదిగా అవినీతి జరుగుతోంది. పోలవరం కంటే అవినీతి విద్య వైద్యంలో అవినీతి ఎక్కువుగా జరిగింది. దీనిపైన విచారణ జరిపించాలని సీఎంను కోరాను.

Follow Us:
Download App:
  • android
  • ios