మంగళగిరి: తమ డిపార్ట్‌మెంట్ లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగిని కోసం ఇద్దరు పోలీసులు పోటీపడ్డారు. ఆమెను దక్కించుకోడానికి ప్రయత్నించి చివరకు ప్రాణత్యాగానికి సైతం సిద్దమయ్యారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో డిపివోలో జూనియర్ అసిస్టెంట్స్ నాగరాజు, రుద్రనాథ్ లకు అక్కడే పనిచేసే కాంట్రాక్ట్  ఉద్యోగిణితో పరిచయం ఏర్పడింది. ఇద్దరితోనూ ఆమె సన్నిహితంగా వుండటంతో వారు దాన్ని ప్రేమగా భావించినట్లున్నారు. దీంతో ఆమెపై విపరీతమైన ఇష్టాన్ని పెంచుకున్నారు. 

read more ఏపిలో భారీ ఉద్యోగాల భర్తీ... సీఎం జగన్ ఆదేశం

ఈ క్రమంలోనే యువతి  కోసం వారిద్దరు  కార్యాలయంలోనే  బాహాబాహీకి దిగారు. దీంతో ఒకరు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా సహోద్యోగులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అయితే  అప్పటికే అతడు తాను ఎందుకు సూసైడ్ చేసుకోవాలని అనుకుంటున్నాడో వివరిస్తూ ఫేస్ బుక్ లో లైవ్ పెట్టాడు. 

read more వర్షాలతో పంటనష్టం... పొలాల్లోకి వెళ్లి రైతులకు భరోసానిచ్చిన వ్యవసాయమంత్రి

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఈ విషయం రూరల్ ఎస్పీ సీహెచ్ విజయారావు దృష్టికి వెళ్లింది. దీంతో సీరియస్ అయిన ఆయన ఈ ముగ్గురు ఉద్యోగులను విధులనుండి తొలగిస్తూ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు జరుపుతామని ఎస్పీ వెల్లడించారు.