జగన్ ప్రభుత్వ నిర్ణయాలు అత్యద్భుతం...: నోబెల్ గ్రహీత్ కైలాస్ సత్యార్థి
నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి మంగళవారం ఏపి ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పరిపాలనను, మరీ ముఖ్యంగా విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలను ఆయన ప్రశంసించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాఠశాల విద్యలో చేపడుతున్న సంస్కరణలు, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఏపి మోడల్ స్టేట్‌గా తయారవుతోందని నోబెల్ అవార్డు గ్రహీత సత్యార్ధి కైలాస్ ప్రశంసించారు. ఆంధ్ర ప్రదేశ్ పర్యటనలో భాగంగా ఆయన అమరావతికి విచ్చేసిన సత్యార్థి ముఖ్యమంత్రి జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంతో కాస్సేపు సత్యార్థి సమావేశమయ్యారు.
సమావేశం అనంతరం సత్యార్థి మాట్లాడుతూ... ముఖ్యమంత్రితో చాలా మంచి సమావేశం జరిగిందన్నారు. జగన్‌ను కలిసిన పలు అంశాలపై చర్చించనట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వం పాఠశాల విద్యార్ధులకు అందిస్తున్న పలు కార్యక్రమాలు గురించి ఈ సందర్భంగా చర్చకు వచ్చాయన్నారు.
read more ఏపి శాసనమండలిలో గందరగోళం... తెలంగాణ మండలికీ గండం: మాజీ మంత్రి దాడి
వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్ధ బాగుందని నోబెల్ గ్రహీత అన్నారు. ప్రధానంగా పేద మహిళలకు చేయూతనిచ్చే అమ్మఒడి కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమం అమలు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మోడల్ రాష్ట్రంగా మిగిలిపోతుందన్నారు.
ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాలకు తమ సంస్ధ తరపున కూడా అన్ని రకాల సహాయ, సహకారాలందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఛైల్డ్ ఫ్రెండ్ స్టేట్ అన్న ఆయన.. ఈ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల వల్ల చిన్నారులకు కుల, సాంఘిక వివక్ష లేకుండా విద్య అందుతుందని తాను భావిస్తున్నానని అన్నారు.
read more ఏపికి మూడు రాజధానులు... కేంద్ర ప్రభుత్వ జోక్యం వుండదు...: బిజెపి ఎంపీ జివిఎల్
ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా పిల్లలు మంచి విద్య పొందేందుకు అవకాశాలున్న రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. యువముఖ్యమంత్రి సారధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి చిన్నారి ఆనందంగా ఉంటారని భావిస్తున్నాన్నట్లు కైలాస్ సత్యార్థి తెలిపారు.