ఇక ఎన్నికలెందుకు... నామినేట్ చేసుకుంటే సరి: జగన్ సర్కార్ కు నిమ్మకాయల చురకలు

ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విరుచుకుపడ్డారు. స్థానికసంస్థలకు ఎన్నికలు నిర్వహించే బదులు నామినేటెడ్ మార్చుకుంటే సరిపోయేదని ఎద్దేవా చేశారు. 

Nimmakayala Chinarajappa Satires on YSRCP Govt and YS Jagan

ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నేతలు రాజ్యాంగం, ‎రాజ్యాంగబద్ద సంస్ధల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు.  మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.....ఎన్నికల కోడ్ అమలులో ఉన్నపుడు  సీఎస్, కలెక్టర్లు, డీజీపీ, ఎస్పీలతో పాటు మిగతా అధికారులందరూ ఎన్నికల కమిషన్ నిబందనల మేరకు పనిచేయాల్సి వుంటుందన్నారు.  కానీ అధికారులు ఆ విధంగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. 

ఎన్నికల్లో వైసీపీ చేసిన అక్రమాలపై పలుమార్లు తాము అధికారులను విన్నవించినా పట్టించుకోలేదన్నారు. కరోనాని జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించటంతో ఎన్నికల సంఘం ఎన్నికలు వాయిదా వేసిందని...  ఈ విషయంలో ఎన్నికల సంఘాన్ని తప్పుబడుతూ వైసీపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. ఎన్నికలు వాయిదా వేయకుండా యదాతదంగా జరపాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నిలక సంఘానికి లేఖ రాసే అధికారం ఎక్కడిది?  లేఖ రాయటం అంటే ఈసీ ఆదేశాలను దిక్కరించటమే అవుతుందన్నారు. ముఖ్యమంత్రికి, వైసీపీ నేతలకు ఎన్నికల సంఘం అంటే  గౌరవమే లేదని స్పష్టంగా అర్థమవుతుందన్నారు.

టీడీపీ హాయాంలో కేవలం కమ్మ సామాజికవర్గానికి చెందిన డీఎస్సీలు 9 మంది ఉంటే 40 మంది ఉన్నారని వైసీపీ నేతలు గోబెల్స్ ప్రచారం చేశారని మండిపడ్డారు. కానీ నేడు  రెడ్డి సామాజకివర్గానికి చెందిన 60 మంది డీఎస్సీలు ఉన్నారని, 280 మందికి  రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి వివిధ పోస్టులు ఇచ్చారని ఆరోపించారు.    దీనికి వైసీపీ నేతలు ఏం సమాధానం చెప్తారు?  అని మాజీ హోంమంత్రి ప్రశ్నించారు.  

read more   కరోనాపైనా చంద్రబాబు, పవన్, కన్నాలు ఒకే తాటిపైకి...: వెల్లంపల్లి ఎద్దేవా

ప్రజా సమస్యలపై 9 నెలలుగా కనీసం ఒక్క ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడని జగన్ నేడు ఎన్నికలు వాయిదా వేశారని హడావుడిగా మీడియా ముందుకు వచ్చి ఈసీని విమర్శించటం బాధాకరమన్నారు.  రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారాం బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వీరి వ్యవహారశైలిపై  కోర్టుకు  వెళతామని హెచ్చరించారు.  

అక్రమంగా స్ధానిక సంస్ధలను వైసీపీ ఏక్రగ్రీవాలు చేసుకుంటే ఇక ఎన్నికలు నిర్వహించటం ఎందుకు?  ఈ పదవులన్నింటిని కూడా నామినేటెడ్ చేసుకోవచ్చు కదా అని ఎద్దేవా చేశారు.  కరోనాని కేంద్రం  జాతీయ విప్తుతుగా ప్రకటించినప్పటికీ ఈ ప్రభుత్వం చాల తేలిగ్గా తీసుకుందని... కాకినాడ,  గుంటూరు, ఏలూరు  పలు ఆస్పత్రుల్లో  కరోనా లక్షణాల  రోగులు ఉన్నారని పేర్కొన్నారు.  

read more  ఏపి పోలీస్ డిపార్ట్ మెంట్ లో కరోనా కలవరం... కానిస్టేబుల్ కొడుకుకు లక్షణాలు

6 వేల మంది విదేశాల నుంచి ఏపికి వచ్చారని... అసలు వారి పట్ల ఎలాంటి  జాగ్రత్తలు తీసుకున్నారో ప్రభుత్వం చెప్పాలన్నారు.  వైసీపీ ప్రభుత్వానికి తమ స్వార్దం తప్ప ప్రజా సంక్షేమం పట్టదా అంటూ  చినరాజప్ప మండిపడ్డారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios