ప్రియుడి మోజులో పడి కన్నపిల్లలను చిత్రహింసలకు గురిచేస్తున్న తల్లి ఉదంతం గుంటూరు జిల్లాలో బయటపడింది. బాపట్లకు చెందిన ఓ వివాహితకు ఇద్దరు పిల్లలు. భర్తతో విడిపోయి శ్రీను అనే వ్యక్తితో కలిసి ఉంటోంది.

అయితే పిల్లలు తన మాట వినడం లేదని, తమ ఏకాంతానికి అడ్డు వస్తున్నారని తరచుగా కోపానికి వచ్చేది. ఎనిమిదేళ్లలోపున్న కొడుకు, కూతురిని మేకుల గుచ్చిన కర్రతో కొట్టి హింసించేది. మంగళవారం కూడా అలాగే పిల్లలపై విరుచుకుపడింది.

విచక్షణా రహితంగా పిల్లల్ని కొట్టి ఇంటి నుంచి గెంటేసింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వార్డు సచివాలంలోని మహిళా పోలీసు మరకా జ్యోతి వచ్చేసరికి వివాహిత పారిపోయే ప్రయత్నం చేసింది. స్థానికుల సహకారంలో ఆమెను అడ్డగించి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.