మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నూతక్కి గ్రామంలో వడ్డీ వ్యాపారుల అరాచకాలు మితిమీరిపోతు్నాయి. ఓ మహిలపై శివరామిరెడ్డి అనే వడ్డీ వ్యాపారి దాడి చేశాడు.  శివ రామి రెడ్డి హిమమ్ బీ అనే మహిళ వద్ద  రూ.50 వేలు అప్పు తీసుకుంది. రూ.5 వడ్డీతో అతనికి ఆమె అప్పు చెల్లించింది. అయినా సరే ఇంకా చెల్లించాలంటూ వేధింపులకు పాల్పడ్డాడు. 

హిమమ్ బీ చెందిన 5 సెంట్లలో ఉన్న ఇంటిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఇల్లు ఖాళీ చేయలేదని హిమామ్ బి పై దాడి శివరామిరెడ్డి దాడి చేశాడు. తన అనుచరులతో కలసి  ఫోక్లైనర్ తో ఇల్లును ధ్వంసం చేశాడు. 

జరిగిన ఘటనపై స్థానిక పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసింది. అయితే స్థానిక పోలీసులు పట్టించుకోలేదు. దీంతో  హిమమ్ బీ అర్బన్  ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేసింది.