జగన్ స్త్రీ పక్షపాతి...కాబట్టే మధ్యపాన నిషేధం...: మంత్రి వనిత
ఏపి ముఖ్యమంత్రి జగన్ స్త్రీ పక్షపాతి కాబట్టే రాష్ట్రంలో మధ్యపాన నిషేధం అమలవుతోందన్నారు. ఆయన పాలనలో మహిళలకు సురక్షితంగా వుండగలుగుతున్నారని అన్నారు.
అమరావతి: గర్భిణి, బాలింతలు, ప్రీ స్కూలుకు వెళుతున్న పిల్లలకు పౌష్టికాహారం అందిచడమే ప్రభుత్వ లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.
గత ప్రభుత్వం ఈ వర్గాలకు పౌష్టికాహారం అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కానీ తాము ఈ ఐదునెలల పాలనలోనే ఈ శాఖను గాడిలో పెట్టి చిన్నారులు, మహిళల్లో పౌష్టికాహారం లేకుండా వుండేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ పై ఇప్పటికే రెండుసార్లు సీఎం జగన్ సమీక్షించారని తెలిపారు. సీనియర్ సిటీజన్స్ రక్షణ కోసం త్వరలో స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని వనిత ప్రకటించారు.
మాతా శిశు మరణాలు తగ్గించేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో రక్తహీనత సమస్య 54 శాతం ఉందని నీతిఆయోగ్ వెల్లడించిందని...ఈ సమస్య పై త్వరలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో ఈ సమస్యను పూర్తిగా రూపుమాపే పరిష్కార మార్గాలు కనుక్కుంటామని తెలిపారు.
ఈనాడుకు ప్రభుత్వ యాడ్స్ ఎందుకు ఇస్తున్నామంటే..: బొత్స...
మహిళ పక్షపాతి కాబట్టే సీఎం దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారన్నారు. మద్యం ధరలు పెరిగితే ఉత్పత్తి దారులకు ఉపయోగం అని టిడిపి ఆరోపించడం దారుణమన్నారు. ప్రభుత్వమే మద్యం షాప్స్ ను నిర్వహించడం చాలా మంచిదన్నారు.
అంగన్వాడీ సెంటర్స్ లో మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అంగన్వాడీల నుంచే పిల్లల్లో వ్యక్తిగత శుభ్రత పాటించేలా చూస్తున్నామన్నారు. హ్యాండ్ వాషింగ్ డే ఉత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు.