కరోనా భయంతో మోసపోతున్న రైతులు... దళారులకు మంత్రి కన్నబాబు వార్నింగ్
కరోనా వైరస్ భయంతో రైతులు మోసపోతున్నారు... వారిని మరింత భయపెట్టి మోసం చేస్తున్న దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు హెచ్చరించారు.
అమరావతి: వ్యవసాయ ఉత్పత్తులపై కరోనా ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఇందుకోసం వ్యవసాయ అనుబంధ శాఖలతో ప్రాంతీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రైతులను మోసం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చిందని... అలాంటివి జరక్కుంగా చూస్తామన్నారు.
కరోనా పేరు చెప్పి దళారులు రైతులను మోసం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికొచ్చిందని అన్నారు. కరోనా ప్రభావంతో ధరలు పడిపోతాయన్న ప్రచారాన్ని నమ్మొద్దని రైతులరు సూచించారు. కరోనా పేరుతో రైతులను భయపెట్టే దళారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
read more కరోనావైరస్ కట్టడికి పవన్ కల్యాణ్ చిట్కాలు
కరోనా కారణంగా దేశంలో పౌల్ట్రీ ఉత్పత్తుల డిమాండ్ పడిపోయిందని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతపురంలో అరటికి గిట్టుబాటు ధర తగ్గిందని గుర్తించామని... దీనిపై చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
మార్కెట్లలో శానిటైజేషన్ చేసి అవి మూతపడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని మార్కెట్లలో అందుబాటులో శానిటైజర్లు వుంచుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో రైతులు, వ్యాపారుల మధ్య సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మే నాటికి రాష్ట్రంలో 12 వేల రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
read more కరోనా ఎఫెక్ట్... వధూవరులను వినూత్నంగా ఆశీర్వదించిన టీఆర్ఎస్ ఎంపీ
త్వరలో జిల్లా స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాలు ఏర్పాటుచేసి రైతులకు సులువుగా రుణాలు అందేలా చేస్తామన్నారు. ఈసారి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల సరఫరా చేస్తామని... గ్రామ సచివాలయంలో నమోదు చేసుకున్న రైతులకు విత్తనాలను పంపిణీ చేస్తామని కన్నబాబు వెల్లడించారు.