Asianet News TeluguAsianet News Telugu

బోటు ప్రమాదాలను నివారించే చర్యలివే: అవంతి శ్రీనివాస్

ఏపి ముఖ్యమంత్రి జగన్ ఇవాళ టూరిజం, క్రీడా శాఖలపై అమరావతిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాకు వివరించారు.  

minister avanthi srinivas once again reacts on godavari boat acchident
Author
Amaravathi, First Published Oct 11, 2019, 3:37 PM IST

ఇటీవల గోదావరి నదిలో ఘోర బోటు ప్రమాదం చాలామంది  టూరిస్ట్ లను పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇకపై పర్యాటకుల రక్షణకు పెద్దపీట వేస్తూ నదుల్లో బోట్లు ప్రయాణించే చర్యలు తీసుకుంటున్నట్లు పర్యాటన మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు కూడా ప్రారంభించిందని వెల్లడించారు. 

బోటు ప్రమాదాల నివారణకోసం ఓ కమాండ్ కంట్రోల్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే నదీ రవాణా వ్యవస్థపై ఓ కమిటీని ఏర్పాటు చేసి ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.  

ఇవాళ(శుక్రవారం) టూరిజం, స్పోర్ట్స్, యూత్, శిల్పారామం లపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. ఇందులో 15 పర్యాటక ప్రదేశాల్లో వరల్డ్ క్లాస్ హోటల్స్ వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. అలాగే  వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్  తో విశాఖ, విజయవాడ, తిరుపతిలో స్టేడియంలనే తీర్చిదిద్దాలని సూచించినట్లు తెలిపారు.

 రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్... మండల, నియోజకవర్గ స్థాయిలో స్టేడియంలను అభివృద్ధి చేయాలని నిర్ణయించాం.అలాగే క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించి మరింత మెరుగైన రాబట్టి రాష్ట్ర ప్రతిష్ట  మరింత పెరిగేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. 

 కొండపల్లి పోర్ట్, గాంధీ మ్యూజియంలను త్వరలో పూర్తి చేయాలని సూచించారు. ఆర్కియాలజీ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. బాషా, సంస్కృతి అభివృద్ధికి కృషి చేయాలని....సంస్కృతి వికాస కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కళాకారులను గుర్తించి ప్రోత్సాహకాలు అందించి  స్కిల్ డెవలప్ మెంట్ తో ఇంటిగ్రేట్ చేయాలని...ఇలా ఉపాధి అవకాశాలు కల్పించాలని  ముఖ్యమంత్రి జగన్ సూచించినట్లు అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. 

మా అధినేత జగన్ గేట్లు తెరిస్తే టీడీపీలో ఎవ్వరు మిగలరన్న అవంతి మాజీ మంత్రి గంటా పార్టీలో చేరతారా? అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం దాటవేశారు. ఈ ప్రశ్నకు మంత్రి అవునని గానీ, కాదని గానీ సమాధానం చెప్పలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios