గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో మరో సెల్ఫీ వీడియో ఆత్మహత్య కలకలం రేపుతోంది.  ‘‘నేను చనిపోతున్నాను... నా పిల్లల్ని ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ ఆవేదన’’ వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. వారం క్రితం మరణించిన తన భార్య మృతి తట్టుకోలేక చనిపోతున్నానంటూ కారంపూడి  మండలం గాదేవారిపల్లెకి చెందిన రాంపాటి అశోక్ సెల్ఫీ వీడియో తీశాడు. 

ఆదివారంనాడు ఊరు చివర చెట్టుకు ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. గత వారం  తన భార్య చనిపోయిందని... తాను (భార్య)  లేకుండా ఉండలేనటూ సెల్ఫీ వీడియో తీశాడు. తన చావుకు ఎవరు కారణం కాదని..  తన పిల్లల్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వేడుకున్నాడు. అలాగే తన సమాధిపై  క్రికెట్ బ్యాట్, రెండు బాల్స్ పెట్టాలని చివరి కోరికగా అశోక్ వీడియోలో పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

"