ప్రేమించి, వెంటపడి పెళ్లి చేసుకోమనగానే యువతిని చంపేసి.. శరీరాన్ని ముక్కలుగా కోసి నిప్పుపెట్టిన దారుణమైన ఘటనలో కిరాతకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాత గుంటూరుకు చెందిన ఓ యువతికి 2009లో పాలిటెక్నిక్ చదివే సమయంలో అదే కాలేజీలో చదువుతున్న అలీనగర్ చెందిన షేక్ కరీం అలియాస్ నాగూర్ తో పరిచయం అయ్యింది. అది ప్రేమకు దారి తీసింది.

చదువుతరవాత టూ వీటర్ షో రూంలో ఉద్యోగం చేస్తున్న యువతి అక్కడ రఫీ అనే యువకుడితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో నాగూర్ ఉద్యోగం మాన్పించాడు. 2018 మే 25న ఫ్రెండ్ పెళ్లి అని చెప్పి యువతిని ఇంట్లో నుండి బైటికి వచ్చేలా చేశాడు.

ఆమెను నేరుగా పాత గుంటూరులో తాను అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకెళ్లాడు. ఇక్కడ అమ్మాయి తొందరగా పెళ్లి చేసుకోమని అడిగింది. ఎవరితోపడితే వాళ్లతో క్లోజ్ గా ఉంటావ్ నిన్ను పెళ్లి చేసుకోను అంటూ నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపానికివచ్చిన నాగూర్ ఆమె తలను గోడకేసి కొట్టాడు. దీంతో యువతి  స్పృహ తప్పింది. ఆ తరువాత ఆమెను గొంతు నులిమి చంపి, గోడలు కోసే యంత్రంతో ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు.

చీకటి పడ్డాక ఆ ముక్కల్ని మూటకట్టి టూ వీలర్ మీద సుద్దపల్లి డొంక దగ్గర్లోని విజయశాంతి నగర్ లోని చెట్ల పొడల్లో పడేశాడు. మూట దొరికితే తాను పోలీసులకు దొరికిపోతాననుకుని పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. కెమికల్ ఇంజనీరింగ్ చదివిన కరీం తన తెలివితో రక్తం మరకలు ఇతర ఆధారాలు లేకుండా చెరిపేశాడు. 

అయితే రెండేళ్ల తరువాత కేసు బైటపడడం, కాలిపోయిన శరీరంలో అస్తిపంజరం తలభాగంలో దెబ్బలు ఉన్నాయని తేలడంతో పోలీసులు అనుమానంతో దర్యాప్తు చేస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.