గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో విషాదకరమైన సంఘటన జరిగింది. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం ఆర్ఆర్ సెంటర్లో ప్రేమ జంట ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

చిత్తూరు జిల్లాకు చెందిన శైలజ (17), గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన యువకుడు పవన్ కుమార్ (20) ఆత్మహత్య చేసుకున్నారు. టిక్ టిక్ ద్వారా వారిద్దరికి పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. 

గత నెల 3వ తేదీన తిరుపతిలో పెళ్లి చేసుకునిడ మాచాయపాలెం ఆఆర్ సెంటర్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు.  అమ్మాయి తల్లిదండ్రులు పవన్ కుమార్ ను చంపుతామని బెదిరించడంతో సూసైడ్ నోట్ రాసి ఇరువురు ఆత్మహత్య చేసుకున్నారు. బెల్లంకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.