గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. బ్యాంకు లోపల ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారిద్దరు కళాశాలలో కలిసి చదువుకున్నారు. 

యువతి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తుండగా, యువకుుడ ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. యువతి రెండు రోజుల నుంచి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పారత గుంటూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

ఆ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతురాలి మొబైల్ ఆధారంగా టవర్ లోకేషన్ ను కనిపెట్టారు. అది బ్రాడీపేటలో ఉన్నట్లు టవర్ లొకేషన్ చూపించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. 

ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రేమ పెళ్లిని పెద్దలు అంగీకరించకపోవడం వల్లనే వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. మృతదేహాలను శనివారం ఉదయం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు.