కొండవీడు లో దసరా పండగ సందర్భంగా వస్తున్న పర్యాటకులకు కొండలపై నుండి జారిపడిన పెద్ద పెద్ద బండరాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో కొండ మీద నుంచి ఘాట్‌రోడ్‌పై బండరాళ్లు జారిపడుతున్నాయి.

అయినప్పటికీ నేతలు కానీ, అధికారులు కానీ పట్టించుకోకపోవడం లేదు. మంగళవారం ఈ సంఘటనలు ఎక్కువగా జరిగాయి. దీంతో వాహనదారులు, ప్రజలు అవి ఎక్కడ జారిపడతాయోనని భయాందోళనకు గురయ్యారు.

మరోవైపు జారిపడిన బండరాళ్లు అధికారులు తొలగించాలని నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. అట్టహాసంగా ప్రారంభ మయిన కొండవీడు ఘాట్ రోడ్డు నిర్వహణా లోపంతో  ప్రమాద భరితంగా తయారవడం పాలకుల వైఫల్యం వల్లేనని విమర్శించారు.