మాజీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం మంగళగిరి కోర్టులో పూచీకత్తు సమర్పించారు. శాసనసభ ఫర్నీచర్‌ ను సొంత వ్యాపారాల కోసం ఉపయోగించారన్న అభియోగాలు శివరాం పై నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో భాగంగానే హైకోర్టు ఆదేశాల మేరకు శివరామ్‌ మంగళగిరి కోర్టులో హాజరై  పూచీకత్తు  సమర్పించారు. 

అసెంబ్లీ ఫర్నీచర్ ను సొంత వ్యాపారాలకోసం వాడుకున్న కోడెల శివరాంపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అతడు ముందస్తుగానే నర్సరావుపేట మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట కోడెల శివరాం లొంగిపోయాడు. ఈ కేసు విషయమై కోడెల శివరాంకు కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చింది. 

కోడెల శివరాం నర్సరావుపేటలో ఉండడం, తిరగడంపై ఆంక్షలు విధించింది.  తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నర్సరావుపేటలో ఉండకూడదని కోడెల శివరాంను కోర్టు ఆదేశించింది.  కే ట్యాక్స్ పేరుతో కోడెల శివరాం డబ్బులు వసూళ్లు చేశారని పలు ఫిర్యాదులు అందాయి. వీటిపై కూడా కేసులు నమోదయ్యాయి.