కోడెల శివప్రసాద్ రావు విగ్రహం దిమ్మె కూల్చివేత

కోడెల శివప్రసాద్ రావు విగ్రహ ఏర్పాటు ప్రయత్నాలను అధికారులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో కోడెల విగ్రహం ఏర్పాటుకు టీడీపి నేతలు ప్రయత్నించారు. అనుమతి లేదంటూ అధికారులు దిమ్మెను కూల్చేశారు.

Kodela Sivaprasad Rao statue erection stalled

గుంటూరు: దివంగత టీడీపి నేత, మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు విగ్రహం ఏర్పాటుకు ఆటంకం ఏర్పడింది. విగ్రహం ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ నేతలు ఏర్పాటు చేసిన దిమ్మెను అధికారులు కూల్చివేశారు. 

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం లింగారావుపాలెంలో ఆదివారం రాత్రి ఆ సంఘటన చోటు చేసుకుంది. పోలీసు బందోబస్తు మధ్య పంచాయతీ అధికారులు వచ్ిచ దిమ్మెను ధ్వం చేశారు. 

గ్రామంలోని పాల కేంద్రం వద్ద ఎన్టీఆర్ విగ్రహం సమీపంలోని దిమ్మెను నిర్మించారు. కోడెల విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. అయితే, విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదని అంటూ పంచాయతీ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య వ్చిచ దిమ్మెను తొలగించారు. 

అధికారుల చర్యపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రోద్బలంతోనే అధికారులు దిమ్మెను కూల్చివేశారని విమర్శిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios