గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని కల్యాణ్​ జ్యూవెలర్స్ లో పనిచేసే​ సుభాని అనే  ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన స్వగ్రామమైన దుగ్గిరాల మండలంలోని చిలువూరు గ్రామంలో ఓ నిర్మానుష్య ప్రాంతంలో పురుగు మందు తాగి అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ అతడు  తన సెల్ ఫోన్ లో ఓ సెల్పీ వీడియోను రికార్డు చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్ధిక లావాదేవిల్లో తేడా రావడంతోనే  సూసైడ్ చేసుకుంటునట్లు సదరు యువకుడు వీడియోలో వివరించాడు. 

వీడియో

"

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.