Asianet News TeluguAsianet News Telugu

జనసేన మరో ప్రధాన కార్యదర్శిగా శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్

జనసేన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ ను నియమిస్తూ పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు నియమించారు. ఇప్పటికే శ్రీ తోట చంద్ర శేఖర్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తాజా నియామకంతో ఇద్దరు ప్రధాన కార్యదర్శులయ్యారు. 

Janasena general secretary Sri Tammyreddy Sivashankar
Author
Hyderabad, First Published Nov 11, 2019, 7:18 PM IST

జనసేన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ ను నియమిస్తూ పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు నియమించారు. ఇప్పటికే శ్రీ తోట చంద్ర శేఖర్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తాజా నియామకంతో ఇద్దరు ప్రధాన కార్యదర్శులయ్యారు. సోమవారం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో శ్రీ పవన్ కల్యాణ్ గారి చేతుల మీదుగా శ్రీ శివశంకర్ నియామక పత్రం అందుకున్నారు.

విశాఖపట్నంలో చేపట్టిన లాంగ్ మార్చ్ అనంతరం శ్రీ పవన్ కల్యాణ్ గారు శ్రీ శివ శంకర్ కు అభినందనలు తెలుపుతూ పార్టీపరంగా ఆయనకు ముఖ్య బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ఆ క్రమంలో ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అంబేడ్కర్, ఫూలే సిద్ధాంతాల ప్రభావంతో... ప్రభుత్వ సర్వీసు నుంచి 2018లో స్వచ్ఛంద పదవి విరమణ చేసి జనసేన పార్టీలో శ్రీ శివశంకర్ చేరారు. విజయనగరం జిల్లాకు చెందిన ఆయన తొలుత హైడ్రో జియాలజిస్ట్ గా పని చేశారు.

1995లో గ్రూప్ 1కు ఎంపికై వాణిజ్య పన్నుల శాఖలో పలు ముఖ్య బాధ్యతల్లో విధులు నిర్వర్తించారు. అంబేడ్కర్, ఫూలే సిద్ధాంతాలతో ప్రభావితమైన శ్రీ శివశంకర్ శ్రీకాకుళంలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. శ్రీ పవన్ కల్యాణ్ గారు ఆలోచన విధానాలకు, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై 2018లో ఉద్యోగానికి రాజీనామా చేసి జనసేనలో చేరారు.

అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకొంటూ, పార్టీ అప్పగించిన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన అధికార ప్రతినిధిగా ఉన్నారు.  శ్రీ శివశంకర్ మాట్లాడుతూ “ఇది పదవి కాదు బాధ్యత అని భావిస్తున్నాను. పార్టీలో నిబద్ధతతో కష్టపడి పని చేసేవారిని పవన్ కల్యాణ్ గారు గుర్తిస్తారు అనడానికి నేనే ఉదాహరణ. నాకు ఈ బాధ్యతలు అప్పగించిన శ్రీ పవన్ కల్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను” అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios