గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి హత్య చేశాడు. వివాహేతర సంబంధం కారణంగా ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. రేపల్లే ఉప్పూడి రోడ్డులో ఈ దారుణ సంఘఠన జరిగింది. 

భార్య మరో  వ్యక్తితో అక్రమ సంబందం ఉందన్న అనుమానంతో భర్త హత్య చేశాడు.ఆ తర్వాత పురుగుల మందు తాగి రేపల్లె పోలీస్ స్టేషన్లో లొంగి పోయాడు. 

అతని పరిస్థితి విషమంగా ఉంది. దీంతో అతన్ని తెనాలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రేపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.