పంచాయతీ ఆఫీసులపై జగన్ బొమ్మ: మండిపడిన హైకోర్టు
ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులు వేయడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై న్యాయస్థానం బుధవారం విచారణ చేపడుతూ ప్రభుత్వ చర్యలను తప్పుబట్టింది.
అమరావతి: పంచాయతీ రాజ్ కార్యాలయాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బొమ్మను వేయడంపై హైకోర్టు మండిపడింది. పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులపై ప్రభుత్వ తీరును హైకోర్టు ఆక్షేపించింది. పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.
పంచాయతీ కార్యాలయపై సీఎం ఫొటో ఎందుకు ముద్రించారని హైకోర్టు ప్రశ్నిస్తే రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నారు కాబట్టి ముద్రించినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కావాలంటే కార్యాలయం లోపల సీఎం ఫొటో పెట్టుకోవచ్చునని హైకోర్టు చెప్పింది.
read more పిచ్చి నవ్వు నవ్వుతూ ఎదురుదాడి.: జగన్ మీద చంద్రబాబు వ్యాఖ్య
పార్లమెంటుపై ప్రధాని ఫొటోను, సుప్రీంకోర్టుపై ప్రధాన న్యాయమూర్తి ఫొటోను ముద్రించారని అని హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి సంప్రదాయం ఎక్కడుందో చెప్పాలని నిలదీసింది. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేశారనే విషయంపై న్యాయవాది చెప్పిన మాటలపై హైకోర్టు వ్యాఖ్యలు చేసింది.
వైసీపీ రంగులు వేరు, కార్యాయాలకు వేసిన రంగులు వేరని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పగా తాము వాటిని పోల్చుకోగలమని వ్యాఖ్యానించింది. అదే సమయంలో టీడీపీ, వైసీపీ జెండాలను తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.
read more చంద్రబాబుకు జీవీఎల్ షాక్: అమరావతిలో భూదందాపై వ్యాఖ్యలు
దీనిపై రాష్ట్ర ఎన్నికల కమీషన్ ను వివరణ కోరగా మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ వచ్చిన తర్వాత తాము పంచాయితీలపై పార్టీ రంగులకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోగలమని తెలిపింది. ప్రస్తుతం తమకు ఎలాంటి అధికారం లేదని ఎన్నికల కమిషన్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఈ విషయంపై నిర్ణయాన్ని తామే వెల్లడిస్తామంటూ విచారణ రేపటికి వాయిదా వేసింది.