పల్నాడు ఫ్యాక్షన్... స్వగ్రామాలను వీడిన కుటుంబాలను పరామర్శించిన ఐజీ

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పల్నాడులోని కొన్ని గ్రామాల ప్రజలు వలసల బాట పట్టిన విషయం తెలసిందే. అలాంటి సున్నిత గ్రామాల్లో ఐజీ పర్యటించారు.   

Guntur Range IG Vineet Brijlal Visit Palnadu

గుంటూరు జిల్లా: దుర్గి మండలంలోని ఫ్యాక్షన్ గ్రామలైన ఆత్మకూరు, జంగమహేశ్వరపాడు గ్రామాలలో గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్,  జిల్లా రూరల్ ఎస్పీ విజయరావులు పర్యటించారు. గ్రామాలలోని ప్రధాన కూడళ్లను, ఎస్సీ కాలనీలను పర్యవేక్షించారు. వీరి వెంట డిఎస్పీ, సిఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది కూడా గ్రామాలను సందర్శించారు.

Guntur Range IG Vineet Brijlal Visit Palnadu

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ రెండు గ్రామాల్లోని కొన్ని కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలసవెల్లిపోయాయి. ప్రత్యర్థుల నుండి ప్రాణహాని వుండటంతోనే ఆ కుటుంబాలు గ్రామాన్ని వదిలివెళ్ళారన్న ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో స్థానిక పోలీసులు చొరవ తీసుకుని రక్షణపై హామీ ఇవ్వడంతో తమ సొంతగ్రామాలకు తిరిగివచ్చారు.ఈ క్రమంలోనే ఐజీ వారిని కలిసి వారి యోగక్షేమాలు కనుకున్నారు.  అలాగే వారు నివాసముంటున్న కాలనీలలో పర్యటించి మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.

Read more ఆరోగ్య ఆంధ్రప్రదేశే లక్ష్యం... డిసెంబరు నుండే పైలట్‌ ప్రాజెక్టు అమలు...

అనంతరం దుర్గి పోలీస్ స్టేషన్ లో ఐజీ విలేకరులతో మాట్లాడుతూ...గ్రామాల్లో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారన్నారు. ఈ విషయంలో  స్ధానిక పోలీసులను    అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. 

గతంలో ఎలక్షన్ కమిషన్ బీహార్ తర్వాత అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా పల్నాడు ప్రకటించిందని... అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. గతంలో పల్నాడు ప్రాంతంలో మావోయిస్టు ప్రభావం  ఎక్కువగా ఉండేదని...ఆ సమయంలో పోలీసులు  కనీసం యూనిఫాం కూడా ధరించేవారు కాదని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం  యూనిఫారం ధరించి  ఉద్యోగం చేస్తున్నారని అన్నారు.

Read more దరిద్రానికి ప్యాంటు, షర్టు వేస్తే అది మీరే...: విజయసాయిపై బుద్దా ఫైర్...

రాష్ట్రంలో మావోయిజం పూర్తిగా అంతరించి పోయిందన్నారు. పోలీసులు వివాదాస్పద గ్రామాల్ని దత్తత తీసుకొని శాంతియుత వాతావరణం నెలకొల్పుతున్నారని...దీన్ని కొనసాగించేందుకు ఉన్నతస్థాయిలో కూడా పూర్తి సహకారాన్ని అందిస్తామని ఐజీ హామీ ఇచ్చారు.  


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios