సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు: గుంటూరు జిల్లా కలెక్టర్
స్పందన కార్యక్రమంలో ప్రజలు ఇచ్చే ఆర్జీలను సంబంధిత శాఖల అధికారులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్.
స్పందన కార్యక్రమంలో ప్రజలు ఇచ్చే ఆర్జీలను సంబంధిత శాఖల అధికారులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతిపత్రాలను కలెక్టర్ స్వీకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల వినతులను పరిష్కరించడంలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించరాదని అధికారులను హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు సంబంధిత ఫిర్యాదులను 72 గంటల లోపు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
ముందుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను శాఖల వారీగా పరిష్కరించాలన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మన సేవా కేంద్రాలను నిర్వహించేందుకు సామాగ్రిని కలెక్టర్ అందజేశారు.
బొల్లాపల్లికి 7, అమరావతికి 4, బెల్లంకొండకు 4, దుర్గికి 2, మాచర్లకు 3, వెల్దుర్దికి 3, అచ్చంపేట మండలాలకు ఒకటి చొప్పున మొత్తం 24 సేవా యూనిట్స్‌ను కలెక్టర్ పంపిణీ చేశారు.