గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. వరుససకు చెల్లెలు అయ్యే బాలికపై అన్నయ్య అత్యాచారం చేశాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలోని అచ్చంపేట మండలంలో గల ఓ గ్రామంలో చోటు చేసుకుింది. 

గ్రామంోని 11 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన చిలకా షడ్రక్ (23) కన్నేశాడు. తల్లిదండ్రులు కూలీకి వెళ్లడంతో శుక్రవారం సాయంత్రం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. విషయం తెలిసి షడ్రక్ ఇంటికి వెళ్లాడు, 

మాయమాటలు చెప్పి బాలికను బాత్రూంలోకి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. దాంతో తల్లిదండ్రులు అచ్చంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు .

ఎస్సై ఆనంద్ రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి పంపించారు సత్తెనపల్ిల డీఎస్పీ ఆర్. విజయభాస్కర్ రెడ్డి, సత్తెనపల్లి రూరల్ సీఐ నరసింహా రావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.